Share News

Hyderabad: ఏం జరిగిందో తెలియదు.. కానీ.. మనిషి మాత్రం..

ABN , Publish Date - May 14 , 2025 | 01:45 PM

ఏం జరిగిందో తెలియదు.. ఎలా జరిగిందో తెలియదు. కానీ.. ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మాత్రం తీవ్ర గాయాలతో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన హైదరాబాద్ నగరంలోని సాయినగర్‌ చౌరస్తాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: ఏం జరిగిందో తెలియదు.. కానీ.. మనిషి మాత్రం..

  • అర్ధరాత్రి తీవ్రగాయాలతో.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి

  • బైక్‌ అదుపు తప్పి పడిపోయాడా.. లేక ఏదైనా వాహనం ఢీకొట్టిందా అనే అనుమానాలు

హైదరాబాద్: అనుమానాస్పదస్థితిలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి చెందిన ఘటన బాచుపల్లి పోలీసుస్టేషన్‌ పరిధిలోని సాయినగర్‌ చౌరస్తాలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... భద్రాది కొత్తగూడెం జిల్లా దమ్మన్‌పేట మండలానికి చెందిన రాజులపాటి త్రివేద్‌ (40) నగరంలో ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. భార్య సుమలతతో కలిసి ప్రగతినగర్‌ ప్రాంతంలోని మధురానగర్‌ రోడ్డు నెంబర్‌ 5లోని పవన్‌ హైట్స్‌లో నివాసముంటున్నాడు.

ఈ వార్తను కూడా చదవండి: MLA: దమ్ముంటే.. ‘స్థానిక’ ఎన్నికలు జరపండి..


సోమవారం డ్యూటీకి వెళ్లిన త్రివేద్‌ రాత్రి 12 గంటల సమయంలో ఇంటికి వస్తూ, సాయినగర్‌ చౌరస్తాలోని చివాస్‌ ప్రాంతంలో గాయాలతో మృతి చెంది ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్ధలాన్ని పరిశీలించి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతుడి వివరాలు సేకరించిన పోలీసులు భార్య సుమలతకు సమాచారం ఇచ్చారు. బంధువులు, కుటుంబ సభ్యులతో కలిసి భార్య గాంధీ ఆస్పత్రివెళ్లి డాక్టర్లను సంప్రదించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.


city9.2.jpg

డ్యూటీకి వెళ్లిన తన భర్త రాత్రి ఇంటికి తిరిగి వస్తుండగా సాయినగర్‌ కమాన్‌ వద్ద బైక్‌ అదుపు తప్పి కిందపడి మృతి చెందాడా? ఏదైనా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లి పోయిందా? అనే అనుమానాలను భార్య సుమలత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వ్యక్తం చేసింది. ఈ విషయంలో సమగ్ర విచారణ జరిపి తగిన చర్య లు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరింది. ఈ మేరకు పోలీసులు కేసు న మోదు చేసి, మృతదేహానికి పోస్టుమార్టం చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.


ఈ వార్తలు కూడా చదవండి

ముగిసిన యుద్ధం మిగిల్చిన ప్రశ్నలు

కృష్ణా జలాల పునఃపంపిణీ తెలంగాణ జన్మహక్కు

ఛీ.. నువ్వు భర్తవేనా.. మద్యం కోసం ఫ్రెండ్స్ వద్దకి భార్యని పంపుతావా?

నీలి చిత్రాల్లో నటిస్తే లక్షలు ఇస్తామని.. వివాహితను హోటల్‌కు పిలిపించి..!

దారుణం.. పురుషాంగం కోసుకుని ఎంబీబీఎస్ విద్యార్థి ఆత్మహత్య!

Read Latest Telangana News and National News

Updated Date - May 14 , 2025 | 01:45 PM