Share News

Home Loans: గృహ రుణాలు తీసుకుంటున్నారా? ఇవి పాటిస్తే మీకు లక్షలు ఆదా..

ABN , Publish Date - Oct 30 , 2025 | 11:36 AM

ఇటీవల కాలంలో చాలా మంది సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ఎక్కువగా హోమ్ లోన్ పై ఆధారపడుతున్నారు. హోం లోన్ విషయంలో స్థిర(ఫిక్స్‌డ్), ఫ్లోటింగ్ అనే రెండు రకాల వడ్డీ రేట్లు ఉంటాయి. గృహ రుణం తీసుకునే విషయంలో ఈ రెండూ వడ్డీ రేట్ల గురించి తెలుసుకుంటే లక్షలు ఆదా చేసుకోవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

Home Loans: గృహ రుణాలు తీసుకుంటున్నారా? ఇవి పాటిస్తే మీకు లక్షలు ఆదా..
Home Loan

ఇంటర్నెట్ డెస్క్: ప్రతి ఒక్కరికి ఎన్నో కలలకు ఉంటాయి. అలాంటి వాటిల్లో సొంత ఇల్లు ఉండాలనే కల ఒకటి. అందుకే కొందరు రేయింబవళ్లు కష్టపడి ఈ డ్రీమ్ ను నెరవేర్చుకుంటారు. మరోవైపు ఇటీవల కాలంలో చాలా మంది సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ఎక్కువగా హోమ్ లోన్(Home Loans) పై ఆధారపడుతున్నారు. హోమ్ లోన్ విషయంలో స్థిర(ఫిక్స్‌డ్), ఫ్లోటింగ్ (Fixed vs Floating Interest Rate)అనే రెండు రకాల వడ్డీ రేట్లు ఉంటాయి. గృహ రుణం తీసుకునే విషయంలో ఈ రెండూ వడ్డీ రేట్ల గురించి తెలుసుకుంటే లక్షలు ఆదా చేసుకోవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..


ఫిక్స్‌డ్ వడ్డీ రేటు:

ఇందులో మనం తీసుకున్న హోం లోన్(Home Loans) కు ఈఎంఐ(EMI Plans) ప్రతి నెలా ఒకే విధంగా ఉంటుంది. మార్కెట్ హెచ్చు తగ్గులతో సంబంధం లేకుండా మనం కట్టే ఈఎంఐ స్థిరంగా ఉంటుంది. ఇది సామాన్యుల బడ్జెట్‌ను సులభతరం చేస్తుంది. దీని వలన నెలవారీ బడ్జెట్ ప్రణాళిక ఈజీ అవుతుంది. ఫిక్స్‌డ్ (Fixed Interest Rate)వడ్డీరేటు ఫ్లోటింగ్ రేటు కంటే 1 నుంచి 1.5 శాతం వరకు ఎక్కువగా ఉంటుంది. ఒక వేళ భవిష్యత్తులో వడ్డీ రేట్లు తగ్గితే.. ఫిక్స్‌డ్ వడ్డీ రేటు వల్ల ఆ బెనిఫిట్స్ దక్కవు.


ఫ్లోటింగ్ వడ్డీ రేటు:

ఫ్లోటింగ్ వడ్డీ రేట్(Floating Interest Rate) అనేది హోమ్ లోన్(Home Loans) పై వడ్డీ రేటు మార్కెట్ పరిస్థితుల ఆధారంగా మార్పులకు లోనవుతుంది. బ్యాంక్ బెంచ్‌మార్క్ రేటుతో ముడిపడి ఉంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఫ్లోటింగ్ వడ్డీ రేటులో మార్కెట్ వడ్డీ రేట్లు తగ్గినప్పుడు ఈఎంఐ తగ్గుతుంది. ఒక వేళ ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచితే.. హోమ్ లోన్ ఈఎంఐ పెరుగుతుంది. ఫ్లోటింగ్ రేట్లు సాధారణంగా ఫిక్స్‌డ్ రేట్ల కంటే తక్కువగా ఉంటాయి. కారణం...దాదాపు వడ్డీ రేట్లు ఎల్లప్పుడూ ఎక్కువగా ఉండవు.


ఎవరైనా అధిక ఫిక్స్‌డ్ రేటు (Fixed Interest Rate) కు రుణం తీసుకుని.. మార్కెట్ రేట్లు తగ్గి ఉంటే, బ్యాలెన్స్ బదిలీ అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆప్షన్ ద్వారా ఫిక్స్ డ్ నుంచి ఫ్లోటింగ్ లోకి బదిలీ కావచ్చు. ఇలా కేవలం 0.5% లేదా 1శాతం రేటు తగ్గింపుతో లక్షల రూపాయలు ఆదా అవుతాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. అయితే ఈ ప్రక్రియలో పలు రకాల ఛార్జీలు ఉంటాయి. కాబట్టి నిర్ణయం తీసుకునే ముందు ఈ ఖర్చులను గమనించండి. ఎవరైనా.. హోమ్ లోన్(Home Loans) తీసుకునే ముందు వారి ఆర్థిక పరిస్థితి, భవిష్యత్తు ఆదాయ అంచనాలు, మార్కెట్ స్థితిగతులను బేరీజు వేసుకొని సరైన నిర్ణయం తీసుకోవడం చాలా అవసరమని నిపుణులు సలహా ఇస్తున్నారు.



ఈ వార్తలు కూడా చదవండి..

Gold Price Today: ఇవాళ్టి మార్కెట్లో బంగారం ధరలు

బీఆర్‌ఎస్‌ గెలిస్తే మూడేళ్లు ఆగాల్సిన అవసరం రాకపోవచ్చు

Updated Date - Oct 30 , 2025 | 12:00 PM