Share News

Vijayawada Municipal Corporation: వీఎంసీ పాలకవర్గంపై ప్రభుత్వం సీరియస్.. కారణమిదే

ABN , Publish Date - Oct 30 , 2025 | 11:23 AM

డ్వాక్రాలోని మహిళా చిరు వ్యాపారులకు దుకాణాలు ఏర్పాటు చేయాలన్న ఆదేశాలు పాలకవర్గం పాటించలేదు. స్కీమ్ అమలు చేయలేమని, రూ.1.16 కోట్లు కేటాయించలేమని అక్టోబర్ 8న తీర్మానం చేసింది.

Vijayawada Municipal Corporation: వీఎంసీ పాలకవర్గంపై ప్రభుత్వం సీరియస్.. కారణమిదే
Vijayawada Municipal Corporation

అమరావతి, అక్టోబర్ 30: విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పాలక వర్గానికి రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) షాక్ ఇచ్చింది. విజయవాడలో స్మార్ట్ స్ట్రీట్ మార్కెట్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ కార్పొరేషన్ చేసిన తీర్మానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించిన పాలక వర్గంపై సీరియస్ అయ్యింది. విజయవాడ నగర పాలక సంస్థ పాలకవర్గం తీరును రాష్ట్ర ప్రభుత్వం తప్పుబట్టింది. డ్వాక్రాలోని మహిళా చిరు వ్యాపారులకు దుకాణాలు ఏర్పాటు చేయాలన్న ఆదేశాలను పాలకవర్గం పాటించలేదు. స్కీమ్ అమలు చేయలేమని, రూ.1.16 కోట్లు కేటాయించలేమని అక్టోబర్ 8న తీర్మానం చేసింది. వైసీపీ ఛైర్‌పర్సన్ మేయర్ రాయన భాగ్యలక్ష్మి నేతృత్వంలోని పాలకవర్గం ఈ మేరకు తీర్మానం చేసింది.


కార్పొరేషన్‌లో వైసీపీకి మెజారిటీ ఉండటంతో ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేస్తున్న పరిస్థితి. అయితే ఈ ఏడాది అక్టోబర్ 8న పంపిన తీర్మానాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలు అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. విజయవాడలోని ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్డులో స్మార్ట్ స్ట్రీట్ మార్కెట్‌ను ఏర్పాటు చేయాలని సర్కార్ ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జూలై 30న విడుదల చేసిన జీవో 753 అమలు చేయాలని నిర్దేశించింది. నగర పాలక సంస్థ వాటా నిధులతో మార్కెట్ ఏర్పాటు చేయాలని కమిషనర్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ ఆదేశాలిచ్చారు.


ఇవి కూడా చదవండి...

చిన్న వెంకన్న ఆలయంలో విష సర్పాల కలకలం

మంత్రి నారా లోకేశ్ పేరిట రూ.54 లక్షలు మోసం..

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 30 , 2025 | 11:46 AM