Share News

Dwaraka Tirumala Temple: చిన్న వెంకన్న ఆలయంలో విష సర్పాల కలకలం

ABN , Publish Date - Oct 30 , 2025 | 10:04 AM

గోశాల నుంచి గోపూజ కోసం సప్త గోకులం వద్దకు ఆవులను సిబ్బంది తీసుకెళ్లారు. సప్త గోకులాన్ని శుభ్రం చేస్తుండగా పక్కనే ఉన్న గడ్డిని ఆవులు మేస్తున్నాయి. ఈ సమయంలో ఆవులను త్రాచుపాములు కాటు వేశాయి.

Dwaraka Tirumala Temple: చిన్న వెంకన్న ఆలయంలో విష సర్పాల కలకలం
Dwaraka Tirumala Temple

ఏలూరు జిల్లా, అక్టోబర్ 30: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న స్వామిని (Dwaraka Tirumala Temple) దర్శించుకునేందుకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలివస్తుంటారు. ఇక్కడ వెంకటేశ్వరస్వామి కొలువై ఉన్నారు. చిన్న వెంకన్నను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వస్తారు. అయితే ఈ మధ్య కాలంలో ద్వారకా తిరుమల ఆలయంలో విష సర్పాలు తరుచుగా కనిపిస్తుండటం కలకలం రేపుతోంది. ఎప్పుడు ఎక్కడి నుంచి పాము వచ్చి కాటేస్తుందో అనే ఆందోళన భక్తుల్లో నెలకొంది.


తాజాగా ద్వారకాతిరుమల చిన్న వెంకన్న గోశాలలో రెండు ఆవులు పాము కాటుకు గురై మృతి చెందాయి. గోశాల నుంచి గోపూజ కోసం సప్త గోకులం వద్దకు ఆవులను సిబ్బంది తీసుకెళ్లారు. సప్త గోకులాన్ని శుభ్రం చేస్తుండగా పక్కనే ఉన్న గడ్డిని ఆవులు మేస్తున్నాయి. ఈ సమయంలో ఆవులను త్రాచుపాములు కాటు వేశాయి. దీంతో రెండు ఆవులు ఉన్నట్టుండి కిందపడిపోయాయి. రెండు ఆవులు ఒకేసారి పడిపోవడాన్ని గమనించిన సిబ్బంది వచ్చి చూడగా.. అవి పాము కాటుకు గురైనట్లు గుర్తించారు.


అయితే మృతి చెందిన ఆవులు పాములపై పడడంతో అవి చనిపోయాయి. మొత్తం మూడు త్రాచుపాములు చనిపోయినట్లు సిబ్బంది తెలిపారు. కాగా.. రెండు రోజుల క్రితం పాత కేశఖండన శాఖ మెట్ల వద్ద ఓ మహిళను కట్లపాము కాటివేసింది. వెంటనే ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే ద్వారకా తిరుమల ఆలయ పరిసరాలు విష సర్పాలకు ఆవాసంగా మారడంతో భక్తులు భయపడుతున్న పరిస్థితి.


ఇవి కూడా చదవండి...

మంత్రి నారా లోకేశ్ పేరిట రూ.54 లక్షలు మోసం..

మొంథా ఎఫెక్ట్.. 4576 కి.మీ రహదారులు ధ్వంసం..

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 30 , 2025 | 11:36 AM