Home » Loans
అనిల్ అంబానీపై రూ. 3,000 కోట్ల లోన్ ఫ్రాడ్ కేసులో ఈడీ తొలి అరెస్టు చేసింది. బిస్వాల్ ట్రేడ్‌లింక్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పార్థసారథి బిస్వాల్‌ను మనీలాండరింగ్ నిరోధక చట్టం 2002 నిబంధనల కింద అదుపులోకి తీసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.3,500 కోట్ల రుణం తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం నిర్వహించిన ఈ-వేలం ద్వారా ఈ అప్పును సేకరించింది.
దేశంలో మధ్య తరగతి కుటుంబాలపై రుణభారం క్రమంగా పెరుగుతోంది. నిత్యావసర ఖర్చులు, వేతనాల్లో పెరుగుదల లేకపోవడం, సులభంగా క్రెడిట్ లభించడం వంటి పలు కారణాలతో లక్షలాది మంది ఆర్థిక చిక్కుల్లో పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో డెట్ కన్సాలిడేషన్ లేదా లోన్ రీస్ట్రక్చరింగ్ (Debt Consolidation vs Loan Restructuring) ఎంచుకుంటే పరిష్కారం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
కొంత మంది జీవితాల్లో అత్యవసరంగా వచ్చే వైద్యం సహా పలు ఖర్చుల కోసం తమ విలువైన ఆస్తులను అమ్మాలని భావిస్తుంటారు. వారికి కారు ఉంటే దాన్ని సేల్ చేయాలని చూస్తుంటారు. కానీ మీరు ఆ కారును అమ్మకుండానే దాని ద్వారా లోన్ (Car Loan) పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అది ఎలా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
మీరు తీసుకున్న బీమా పాలసీ మీకు ఆర్థిక భద్రతను మాత్రమే కాదు, అవసరమైన సమయంలో లోన్ తీసుకునే అవకాశాన్ని కూడా ఇస్తుంది. అవును, మీరు చదివింది నిజమే. ఈ క్రమంలో LIC పాలసీ మీద లోన్ (Policy Loan Process) ఎలా తీసుకోవాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మీకు ఆర్థిక రుణ భారం చాలా ఎక్కువగా ఉందా. అది ఎలా తీర్చాలని బాధపడుతున్నారా. అయితే మీ జీవనశైలిలో చిన్న మార్పులు, తెలివైన నిర్ణయాలు తీసుకుంటే మీ అప్పు నుంచి బయటపడటం సులభమని నిపుణులు (5 Smart Ways to Repayment) చెబుతున్నారు. అది ఎలా అనే విషయాలను ఇక్కడ చూద్దాం.
SBI Quick Loan: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు గుడ్ న్యూస్. వీరు ఇప్పుడు యోనో యాప్ ద్వారా కేవలం 15 నిమిషాల్లోనే రూ.5 కోట్ల రూపాయల వరకూ లోన్ అందుకోవచ్చు. అదెలాగంటే..
ప్రస్తుత కాలంలో లోన్ కోసం బ్యాంకులకు వెళ్లాల్సిన పనిలేదు. మొబైల్ యాప్ ద్వారా నిమిషాల్లోనే తీసుకోవచ్చు. కానీ యాప్స్ నుంచి లోన్స్ తీసుకునే విషయంలో మాత్రం కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం.
దేశంలో పర్సనల్ లోన్ (Personal Loan) తీసుకుని ఆర్నేళ్లపాటు చెల్లించకపోతే ఏం జరుగుతుంది. ఈ క్రమంలో బ్యాంకులు నోటీసులు మాత్రమే పంపిస్తాయా లేదంటే జైలు శిక్ష కూడా పడుతుందా. రూల్స్ ఏం చెబుతున్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసర ఖర్చులతో అనేక మంది కూడా ఆర్థిక ఒత్తిడికి లోనవుతుంటారు. ఈ క్రమంలో లోన్స్ తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇలాంటి సందర్భాల్లో గూగుల్ పే (GPay) ద్వారా ఈజీగా రూ.12 లక్షల వరకు లోన్స్ తీసుకునే ఛాన్సుంది. అది ఎలా అనేది ఇక్కడ చూద్దాం.