Share News

Loan EMIs: గుడ్ న్యూస్.. తగ్గనున్న ఈఎంఐలు.. నేటి నుంచే అమల్లోకి!

ABN , Publish Date - Nov 12 , 2025 | 03:00 PM

తీసుకున్న అప్పులపై బ్యాంకులకు చెల్లించే ఈఎంఐల మొత్తం తగ్గితే రుణగ్రహీతలు ఆనందిస్తారు. ఇవాళ్టి నుంచి కెనరా బ్యాంకు తన ఖాతాదారులకి ఇలాంటి అవకాశమే అందించింది. ఇక నుంచి సదరు బ్యాంకు ఖాతాదార్లు కట్టే ఈఎంఐల మొత్తం తగ్గుతుంది.

Loan EMIs: గుడ్ న్యూస్.. తగ్గనున్న ఈఎంఐలు..  నేటి నుంచే అమల్లోకి!
EMI reduction

రుణాల మీద ప్రతీ నెలా బ్యాంకులకు చెల్లించాల్సిన ఈఎంఐల భారం తగ్గితే సంతోషమే కదా. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన కెనరా బ్యాంక్ తమ కస్టమర్లకు ఇదే శుభవార్త అందించింది. ఖాతాదారుల రుణాల భారాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. వివిధ రుణాలకు సంబంధించి మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లు (MCLR) అన్ని రకాల రుణాలపై 5 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు వెల్లడించింది.

సవరించిన కొత్త ఎంసీఎల్ఆర్ రేట్లు ఇవళ్టి (నవబంర్ 12, 2025) నుంచే అమలులోకి తీసుకొచ్చినట్లు కెనరా బ్యాంక్ తెలిపింది. ఫలితంగా ఫ్లోటింగ్ రేట్ వడ్డీతో కెనరా బ్యాంకులో పర్సనల్ లోన్, ఆటో లోన్, హోమ్ లోన్, తదితర రుణాలు తీసుకున్న వారికి నెలవారీ ఈఎంఐ ( EMI)ల భారం తగ్గుతుంది.


ఇక, MCLR అనేది.. హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, వెహికల్ లోన్స్ వంటి వివిధ రుణాలను ఫ్లోటింగ్ రేటుతో తీసుకునే వడ్డీని నిర్ణయించేందుకు బ్యాంకులు బెంచ్‌మార్క్ రేటుగా దీనిని అనుసరిస్తాయి. ఎంసీఎల్ఆర్ రేటు కన్నా తక్కువకు బ్యాంకులు రుణాలు ఇవ్వవు.

ఎంసీఎల్ఆర్ రేటు తగ్గినప్పుడు రుణాల నెలవారీ వాయిదాల చెల్లింపుల మొత్తం ఆ మేరకు తగ్గుతుంది. లేదా లోన్ టెన్యూర్ తగ్గించుకోవచ్చు. ఇది రుణ గ్రహీతలకు దీర్ఘకాలిక ప్రయోజనం ఇస్తుంది. కాగా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీబీఐ బ్యాంకులు మాత్రం ఎంసీఎల్ఆర్ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో ఆయా బ్యాంకుల్లో రుణాలు పొందిన వారికి కొత్తగా చేకూరే ప్రయోజనం ఏం ఉండదు. ఇంతకుముందు ఎంత మొత్తం ఈఎంఐ చెల్లిస్తున్నారో అంతే చెల్లించాల్సి ఉంటుంది.


ఇవీ చదవండి:

మీ చూపు శక్తివంతమైనదైతే.. ఈ ఫొటోలో తోడేలును 9 సెకెన్లలో కనిపెట్టండి..


మీ మిక్సీ జార్ తిరగడం లేదా.. ఈ సూపర్ ట్రిక్ ఉపయోగించి చూడండి..

Updated Date - Nov 12 , 2025 | 03:23 PM