Silver Loans : ఇక మీదట వెండి మీదా బ్యాంక్స్ అప్పులిస్తాయి.. గుడ్ న్యూస్ చెప్పిన ఆర్‌బీఐ
ABN , Publish Date - Nov 14 , 2025 | 05:19 PM
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ బ్యాంకుల నుంచి రుణం పొందేందుకు వీలులేని వారికి ఇదో పెద్ద గుడ్ న్యూస్. బంగారం లేకపోయినా ఫర్వాలేదు. మీ దగ్గర వెండి వస్తువులు ఉన్నా సరే లోన్ తీసుకోవచ్చు. ఆర్బీఐ ఈ మేరకు..
ఇంటర్నెట్ డెస్క్: డబ్బు అవసరమైనప్పుడు బెస్ట్ ఆప్షన్ గోల్డ్ లోన్. తక్కువ వడ్డీతో బ్యాంకుల నుంచి తక్షణ అవసరాలకోసం డబ్బు పొందే అవకాశం ఉంటుంది. మరి, బంగారం లేకపోతే, అయితే, ఇప్పుడు మీ దగ్గర వెండి వస్తువులు ఉన్నాసరే బ్యాంకులు ఇక మీదట లోన్స్ ఇస్తాయి. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక అద్భుతమైన అవకాశాన్ని ప్రజలకు కల్పిస్తోంది.
మీ దగ్గరున్న వెండి ఆభరణాలు, వెండి నాణేలు, వెండి పెట్టుబడులు, సిల్వర్ బార్స్, సిల్వర్ కాయిన్స్ ఇలా, పలు రకాల వెండి వస్తువుల మీద కూడా ఇకపై బ్యాంకులు లోన్స్ ఇస్తాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త నిబంధనల ప్రకారం 2026 ఏప్రిల్ 1 నుంచి వెండి ఆభరణాలు, నాణేల మీద రుణాలు తీసుకోవచ్చు.
ఆర్బీఐ కొత్త సంస్కరణ ప్రకారం వాణిజ్య బ్యాంకులు(Banks), ఎన్‌బీఎఫ్‌సీలు(NBFC), సహకార బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు వంటి బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు వెండి మీద రుణాలు ఇవ్వబోతున్నాయి.
దీంతో వెండి ఆభరణాలు లేదా నాణేలు ఉన్నవాళ్లు రుణాలు తీసుకొని తాత్కాలిక ఆర్థిక అవసరాలను తీర్చుకోవచ్చు. ఒక్కరు ఎంత మేరకు వెండి మీద రుణం తీసుకోవచ్చు అనే విషయానికొస్తే, వెండి ఆభరణాలు 10 కిలోలు, వెండి నాణేలు 500 గ్రాములు వరకు లోన్ తీసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి..
ఆపేదెవరు.. బీహార్‌లో నితీశ్ ఏకఛత్రాధిపత్యం..
బిహార్‌లో గెలుపు మాదే.. ఇక బెంగాల్‌లోనూ..: కేంద్ర మంత్రి
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..