Hyderabad: నకిలీ ఆధార్, పాన్‌కార్డుతో రూ.16.5 లక్షల రుణం
ABN , Publish Date - Oct 14 , 2025 | 06:42 AM
నకిలీ ఆధార్, పాన్‌కార్డులతో ఓ ఉద్యోగి బ్యాంక్‌కు టోకరా వేశాడు. రూ.16.5 లక్షల అప్పు తీసుకుని మోసానికి పాల్పడ్డాడు. కంచన్‌బాగ్‌లోని ఎస్‌బీఐలో 2023 నవంబర్‌లో ఉప్పల్ హబ్సిగూడ నేషనల్ జియోలాజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో సీనియర్ టెక్నికల్ ఆఫీసర్‌గా పని చేస్తున్న ఉద్యోగి ప్రవీణ్ తన ఆధార్, పాన్‌కార్డు, మూడు నెలల పేస్లిప్‌లను బ్యాంక్ అధికారులకు అందించి పర్సనల్ ఎక్స్‌ప్రెస్ లోన్ కింద రూ.16.50లక్షల రుణం పొందాడు.
హైదరాబాద్: నకిలీ ఆధార్, పాన్‌కార్డు(Fake Aadhaar, PAN card)లతో ఓ ఉద్యోగి బ్యాంక్‌కు టోకరా వేశాడు. రూ.16.5 లక్షల అప్పు తీసుకుని మోసానికి పాల్పడ్డాడు. కంచన్‌బాగ్(Kanchanbagh)లోని ఎస్‌బీఐలో 2023 నవంబర్‌లో ఉప్పల్ హబ్సిగూడ(Uppal Habsiguda) నేషనల్ జియోలాజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో సీనియర్ టెక్నికల్ ఆఫీసర్‌గా పని చేస్తున్న ఉద్యోగి ప్రవీణ్(Praveen) తన ఆధార్, పాన్‌కార్డు, మూడు నెలల పేస్లిప్‌లను బ్యాంక్ అధికారులకు అందించి పర్సనల్ ఎక్స్‌ప్రెస్ లోన్ కింద రూ.16.50లక్షల రుణం పొందాడు.

బ్యాంక్‌కు గత సంవత్సరం నుంచి డబ్బులు చెల్లించడం లేదు. బ్యాంకు అధికారులు ప్రవీణ్ ఇచ్చిన ఆధార్, పాన్‌కార్డులను పరిశీలించగా అవి ఫేక్‌వని తేలింది. దీంతో ప్రవీణ్‌పై చర్యలు తీసుకోవాలని బ్యాంక్ మేనేజర్ శివకుమార్ కంచన్‌బాగ్ ఇన్‌స్పెక్టర్ కమల్‌కుమార్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

ఈ వార్తలు కూడా చదవండి..
వెంకటేష్ నాయుడి ఫోన్ అన్‌లాక్‌కు అనుమతి
వేరుశనగ రైతులకు ఉచిత విత్తనాలు
Read Latest Telangana News and National News