EPF vs VPF: నెలకు రూ.25000 జీతం వచ్చినా పర్లేదు.. ఇందులో సేవ్ చేస్తే కొన్నేళ్లలోనే రూ.2.73 కోట్ల పైన రిటర్న్స్?
ABN , Publish Date - May 30 , 2025 | 01:13 PM
EPF And VPF Comparison: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF), వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (VPF) రెండూ ఉద్యోగుల ఆర్థిక భద్రతకు తోడ్పడేవే. ఇక, EPF జీతం నుంచి ప్రతినెలా తప్పనిసరిగా కార్పస్ ఫండ్ కు వెళ్తుంది. వీపీఎఫ్ మాత్రం వేతన జీవులకు ఉండే మరో సేవింగ్స్ ఆప్షన్. ఈ రెండింటికీ మధ్య ఉన్న తేడాలేంటి? వీపీఎఫ్ ద్వారా రిటైర్ అయ్యాక ఎంత మొత్తం అదనంగా లభిస్తుంది.. తదితర పూర్తి వివరాలు.

Difference Between EPF vs VPF: ఉద్యోగుల భవిష్య నిధి (EPF), స్వచ్ఛంద భవిష్య నిధి (VPF) అనేవి పొదుపు సాధనాలు. గుర్తింపు పొందిన సంస్థల నుంచి జీతం పొందే వ్యక్తులకు పదవీవిరమణ నిధిని పోగు చేసుకునేందుకు సహాయపడతాయి. ఇందులో వచ్చినంత వడ్డీ మరే బ్యాంక్, సేవింగ్స్ స్కీం నుంచి రావనేది అక్షర సత్యం. దీర్ఘకాల పొదుపు ప్రయోజనాల కోసం ఈ పొదుపు పథకాలకు మించినవి ఏవి లేవు. వాస్తవానికి, ఈ రెండూ ఉద్యోగికి ఒకే రకమైన ప్రయోజనాలు అందిస్తున్నప్పటికీ కొన్ని స్వల్ప తేడాలున్నాయి. ఉదాహరణకు, రూ.25,000 ప్రాథమిక జీతం పొందుతున్న వ్యక్తి రిటైర్మంట్ అయ్యేనాటికి VPF ద్వారా ఎంత అదనపు మొత్తాన్ని సంపాదించవచ్చో తెలుసుకుందాం.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) అంటే ఏమిటి?
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) అనేది EPFO (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) నిర్వహించే పదవీ విరమణ పొదుపు పథకం. ఉద్యోగులు, యజమానులు ఇద్దరూ ఇందులో మొత్తాన్ని జమ చేస్తారు. ఉద్యోగి తమ ప్రాథమిక జీతంలో 12 శాతం వాటాను చెల్లిస్తే, అంతే మొత్తాన్ని వారి యజమాన్యం కూడా చెల్లిస్తుంది. యజమాని వాటాలో కొంత భాగం ఉద్యోగి పెన్షన్ పథకానికి వెళితే, మిగిలినది EPF ఖాతాకు వెళుతుంది. ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత వారి ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు సహాయపడుతుంది. మెడికల్ ఎమర్జెన్సీ, అత్యవసర సమయాల్లో ఉద్యోగి తమ ఈపీఎఫ్ నుంచి కొంత మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు.
స్వచ్ఛంద భవిష్య నిధి (VPF) అంటే ఏమిటి?
స్వచ్ఛంద భవిష్య నిధి (VPF) లేదా వాల్యుంటరీ ప్రావిడెంట్ ఫండ్ కూడా EPF పొదుపు పథకం లాంటిదే. EPF, VPF రెండింటిలో వడ్డీ శాతం ఒకేలా ఉంటుంది. ఇక, ఇందులో ఉద్యోగులు తప్పనిసరిగా జీతంలో ఇంత మొత్తాన్ని జమ చేయాలనే రూల్ ఏం లేదు. ఒకవేళ ఉద్యోగి స్వచ్ఛందంగా ఇందులో ఆదా చేసుకుంటే యాజమాన్యం తమ వంతు వాటాని ఇవ్వదు. కానీ, ఉద్యోగులు పదవీ విరమణ కోసం ఎక్కువ సేవింగ్స్ చేసుకోవడానికి VPF వీలు కల్పిస్తుంది. EPF కి విరుద్ధంగా ఉద్యోగులు తమ ప్రాథమిక జీతం, కరువు భత్యంలో 100 శాతం వరకు VPFలో ఆదా చేసుకునే సౌలభ్యం ఉంది. పదవీ విరమణ తర్వాత అధిక మొత్తంలో సేవింగ్స్ రాబట్టుకోవాలని కోరుకునే వేతన జీవులకు ఇదో చక్కటి మార్గం.
VPF, EPF మధ్య తేడా ఏమిటి?
2021 నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగి ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ కింద చేసే కంట్రిబ్యూషన్ మొత్తం రూ. 2.5 లక్షలకు మించినట్టయితే.. అదనపు మొత్తంపై వచ్చే వడ్డీపై ప్రభుత్వానికి ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇదే నిబంధన వాల్యుంటరీ ప్రావిడెంట్ ఫండ్ కింద ఉద్యోగి చేసే కంట్రిబ్యూషన్ కి కూడా వర్తిస్తుంది. రెండింటి మధ్య ఈ విషయంలో ఎలాంటి తేడా లేదు. మరో ప్రధానమైన తేడా EPF లో ఉద్యోగి ఆదా చేసుకునే మొత్తానికి లిమిట్ ఉంటుంది. VPFలో మాత్రం పరిమితులు ఉండవు. రిటైర్మంట్ తర్వాత అధిక ఖర్చులు ఉంటాయని అనుకునే ఉద్యోగులు VPF ని అదనంగా ఎంచుకుంటారు.
రూ.25000 జీతం వచ్చే ఉద్యోగికి రిటైర్మెంట్ తర్వాత EPFలో ఎంతొస్తుంది?
నెలవారీ జీతం (ప్రాథమిక + DA): రూ. 25,000
EPFలో ఉద్యోగి ఫండ్: 12 శాతం
ప్రస్తుత వయస్సు: 25 సంవత్సరాలు (ఉదాహరణకు)
అంచనా వేసిన వార్షిక జీతం పెరుగుదల: 5 శాతం
రిటైర్మంట్ నాటికి మొత్తం పెట్టుబడి: రూ. 45,05,360
మొత్తం వడ్డీ: రూ. 1,35,99,128
మెచ్యూరిటీ కార్పస్: రూ. 1,81,04,488 (పదవీ విరమణ సమయంలో)
VPF లో ఎంతొస్తుంది?
నెలవారీ జీతం (ప్రాథమిక + DA): రూ. 25,000
EPF కు ఉద్యోగి సహకారం: 20 శాతం (ఉదాహరణకు)
ప్రస్తుత వయస్సు: 25 సంవత్సరాలు
అంచనా వేసిన వార్షిక జీతం పెరుగుదల: 5 శాతం
VPF: రూ. 25,000 మూల వేతనంతో మీకు లభించే మొత్తం
మొత్తం పెట్టుబడి: రూ. 68,05,474
మొత్తం వడ్డీ: రూ. 2,05,41,873
మెచ్యూరిటీ కార్పస్: రూ. 2,73,47,347 (పదవీ విరమణ సమయంలో)
ఇవీ చదవండి:
భారత్ కంటే వెనకబడ్డ జపాన్.. అసలు ఆ దేశంలో ఏం జరుగుతోందో తెలిస్తే..
నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. జపాన్ను ఓవర్ టేక్ చేసిన వైనం
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి