Share News

Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్‌కు స్వీట్ తినిపించిన రాష్ట్రపతి.. తీపికబురు అందేనా

ABN , Publish Date - Feb 01 , 2025 | 11:17 AM

Droupadi Murmu: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ మీదే ఇప్పుడు అందరి ఫోకస్ నెలకొంది. ఏయే శాఖకు కేటాయింపులు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని అంతా ఎదురు చూస్తున్నారు.

Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్‌కు స్వీట్ తినిపించిన రాష్ట్రపతి.. తీపికబురు అందేనా
Nirmala Sitharaman-Droupadi Murmu

దేశమంతా ఎంతో ఆసక్తిగా చూస్తున్న రోజు వచ్చేసింది. ఇవాళ బడ్జెట్ డే. కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. దీంతో అందరి ఫోకస్ దీని మీదే ఉంది. ఏయే శాఖకు ఎంత కేటాయింపులు ఉంటాయి, పన్ను మినహాయింపుల దగ్గర నుంచి ధరల వరకు వేటి మీద బడ్జెట్ ప్రభావం ఎంత ఉంటుందో తెలుసుకోవాలని అంతా వెయిట్ చేస్తున్నారు. ఈ తరుణంలో బడ్జెట్‌కు ముందు నిర్మలమ్మకు స్వీట్ తినిపించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆమెకు అభినందనలు తెలుపుతూ దహీ చీని అనే స్వీట్ తినిపించారు.

Updated Date - Feb 01 , 2025 | 12:49 PM