SBI YONO Loan: మీరు SBI ఖాతాదారులా? అయితే 15 నిమిషాల్లో రూ.5 కోట్ల వరకు లోన్ మీ సొంతం!
ABN , Publish Date - May 29 , 2025 | 01:51 PM
SBI Quick Loan: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు గుడ్ న్యూస్. వీరు ఇప్పుడు యోనో యాప్ ద్వారా కేవలం 15 నిమిషాల్లోనే రూ.5 కోట్ల రూపాయల వరకూ లోన్ అందుకోవచ్చు. అదెలాగంటే..

SBI MSME Sahaj Loan: దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్ల కోసం అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. సొంతంగా బిజినెస్ ఏర్పాటు చేసుకుని ఎదగాలని కోరుకునేవారికి ప్రోత్సాహం అందించేందుకు 'MSME సహజ్' లోన్ పథకం ప్రారంభించింది. ఇకపై కస్టమర్లు నెలల తరబడి బ్యాంకు చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా ఈ పథకం కింద కేవలం 15 నిమిషాల్లోనే రూ.5 కోట్ల వరకూ రుణ సౌకర్యం పొందవచ్చు.
15 నిమిషాల్లోనే రుణం
చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల (MSME) ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. MSME సహజ్ ఇన్ వాయిస్ ఫైనాన్సింగ్ పథకం ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ఫైనాన్సింగ్ అవసరాలను వేగంగా తీరుస్తోంది. దరఖాస్తుదారులు ఈ పథకం కింద లోన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు 15 నిమిషాలు పడుతుంది. ఆ వెంటనే ఎస్బీఐ డిజిటల్ పద్ధతిలో ఆమోదం తెలిపి రుణాన్ని మంజూరు చేస్తుంది.
GST కింద నమోదు చేసుకున్న వ్యాపార సంస్థలకు SBI 'MSME సహజ్' కింద రుణ ప్రయోజనాలు అందిస్తోంది. కేవలం 15 నిమిషాల్లో GST రిజిస్టర్డ్ ఇన్‌వాయిస్‌పై అర్హత కలిగిన కస్టమర్లు రూ.1 లక్ష వరకూ రుణాలు పొందుతారు. ప్రక్రియ పూర్తిగా డిజిటల్ మోడ్ లో ఉంటుంది. ఇంతకు ముందు SBI నుంచి రుణం తీసుకోని MSME లకు కూడా ఆర్థిక సహాయం అందుబాటులో ఉంటుంది.
MSME సహజ్ సౌకర్యాన్ని పొందడానికి వ్యాపార సంస్థకు ఏకైక యజమాని అయి ఉండాలి. అలాగే, కరెంట్ ఖాతా లెక్కలు సక్రమంగా ఉంటే సరిపోతుంది. ఇప్పటికే SBI MSME కస్టమర్లుగా ఉన్నవారు YONO SBI మొబైల్ యాప్ ద్వారా MSME సహజ్ ప్రయోజనాన్ని పొందవచ్చు. SBI MSME సహజ్ సౌకర్యం కింద అందించే ఆర్థిక సహాయం స్వల్పకాలిక రుణం రూపంలో ఉంటుంది.
తక్కువ సమయంలోనే MSMEలకు మూలధనం సమకూర్చడం MSME సహజ్ పథకం లక్ష్యం. డిజిటల్ బ్యాంకింగ్, కస్టమర్ల సంఖ్యను పెంచుకునేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఈ పథకాన్ని తీసుకొచ్చింది.
ఇవీ చదవండి:
భారత్ కంటే వెనకబడ్డ జపాన్.. అసలు ఆ దేశంలో ఏం జరుగుతోందో తెలిస్తే..
నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. జపాన్‌ను ఓవర్ టేక్ చేసిన వైనం
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి