MP Appalanaidu: జగన్ అండ్ కో ఏపీలో శవ రాజకీయాలు చేస్తున్నారు.. ఎంపీ కలిశెట్టి విసుర్లు
ABN , Publish Date - Jul 29 , 2025 | 03:06 PM
రైతులు, ప్రజలు, వ్యాపారుల సంక్షేమ కోసం సీఎం చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నారని తెలుగుదేశం విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఉద్ఘాటించారు. అట్టడుగులో ఉన్న ఏపీని ముందు ఉంచాలని సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు.

ఢిల్లీ: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) తెలుగుదేశం విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు (MP Kalisetty Appalanaidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అండ్ కో ఏపీలో శవ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తామని పగటి కళలు కంటున్నారని.. వైసీపీ అధికారంలోకి వచ్చేది ఏమి లేదని ఎద్దేవా చేశారు. ఇవాళ(మంగళవారం) ఢిల్లీ వేదికగా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మీడియాతో మాట్లాడారు. సింగపూర్ పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు పెట్టుబడులు ఏపీకి తీసుకువచ్చేలా కృషి చేస్తున్నారని వ్యాఖ్యానించారు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు.
వైసీపీ ప్రభుత్వంతో తాము ఇబ్బందులు పడ్డామని సింగపూర్‌లో ఉన్న పారిశ్రామిక వేత్తలు చెబుతున్నారని గుర్తుచేశారు. రైతులు, ప్రజలు, వ్యాపారుల సంక్షేమ కోసం సీఎం చంద్రబాబు కష్టపడుతున్నారని ఉద్ఘాటించారు. అట్టడుగులో ఉన్న ఏపీని ముందు ఉంచాలని సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని.. సీఎంకు ఓ ఇమేజ్ ఉందని చెప్పుకొచ్చారు. జగన్ పాలనలో వ్యవసాయంతో పాటు అన్ని రంగాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆరోపించారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గత వైసీపీ పాలనలో వ్యవసాయం ఎంత నిర్లక్ష్యానికి గురైందనేది చెప్పారని అన్నారు. చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్న తీరును చూసి ఒక ఆంధ్రుడిగా గర్వపడుతున్నానని ఉద్ఘాటించారు. ఏపీని సీఎం చంద్రబాబు అగ్రస్థానంలో నిలుపుతారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆకాక్షించారు.
ఈ వార్తలు కూడా చదవండి
వైఎస్ జగన్‌కు బిగ్ రిలీఫ్.. షర్మిలకు షాక్!
పెన్సిల్ ముల్లుపై వైట్‌హౌస్.. ట్రంప్ ప్రశంసలు
Read latest AndhraPradesh News And Telugu News