Anitha: జగన్ పాలన అలా ఉంది.. హోం మంత్రి అనిత ధ్వజం
ABN , Publish Date - Mar 10 , 2025 | 01:56 PM
Home Minister Anitha: వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని ప్రార్థించానని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఉపమాక వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని మంత్రి అనిత తెలిపారు.

అనకాపల్లి: గత జగన్ ప్రభుత్వంలో భక్తులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని హోం మంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. భక్తుల భద్రతకు వైసీపీ ప్రభుత్వంలో కనీస చర్యలు తీసుకోలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ(సోమవారం) ఉపమాక శ్రీ కల్కి వేంకటేశ్వర స్వామి వారి వార్షిక కల్యాణోత్సవం జరిగింది. శ్రీవారి వార్షిక కల్యాణోత్సవం సందర్భంగా ఉపమాక వెంకన్నకు హోం మంత్రి అనిత పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం స్వామిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో మంత్రికి నాయకులు, దేవస్థానం అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు.
ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి, అంతరాలయంలో మంత్రి అనిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రికి ఆశీర్వచనం చేసి, స్వామివారి తీర్థ, ప్రసాదాలను వేద పండితులు అందజేశారు. భరతనాట్య కళాకారులను సత్కరించారు. హోం మంత్రి ఆర్థిక సహాయంతో ఉపమాక ఆలయం వద్ద మజ్జిగ, క్యాలెండర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మీడియాతో మాట్లాడారు. ఉపమాక వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని తెలిపారు.
తెల్లవారుజాము నుంచి భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారని అన్నారు. ఇప్పుడు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని అన్నారు. వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని ప్రార్థించానని అన్నారు. తిరుమల తిరుపతి స్వామి వారి ప్రసాదం కూడా ఉపమాకలో అందుబాటులో ఉందని తెలిపారు. భక్తులకు మజ్జిగ, భోజనం సౌకర్యం ఏర్పాటు చేశామని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Mandipalli : ఆ లెక్కలు తీస్తా.. మంత్రి మండిపల్లి స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: అవినీతి విషయంలో సహించేది లేదు..
BJP MLC candidate: బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోమువీర్రాజు
Read Latest AP News And Telugu News