Ashok Gajapathi Raju: టీడీపీకి రాజీనామా.. అశోక్ గజపతిరాజు భావోద్వేగం
ABN , Publish Date - Jul 18 , 2025 | 02:36 PM
గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజుని భారత ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి, పోలిట్ బ్యూరో సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. అనంతరం అధికారికంగా టీడీపీ హై కమాండ్‌కి ఈ లేఖను పంపించారు.

విశాఖపట్నం: గోవా గవర్నర్‌గా కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుని (Ashok Gajapathi Raju) భారత ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి, పోలిట్ బ్యూరో సభ్యత్వానికి అశోక్ గజపతిరాజు రాజీనామా చేశారు. అనంతరం అధికారికంగా టీడీపీ హై కమాండ్‌కి ఈ లేఖను పంపించారు. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు భావోద్వేగానికి గురయ్యారు. ఇన్నేళ్లు టీడీపీలో ఉన్నానని, పార్టీని వీడుతున్నందుకు బాధగా ఉందన్నారు. పార్టీ, నేతలతో ఉన్న మధుర క్షణాలని ఆయన గుర్తు తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా పార్టీకి అశోక్ గజపతిరాజు ఎంతగానో సేవలు అందించారని నేతలు కొనియాడారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎంతో కృషి చేశారని ప్రశంసల వర్షం కురిపించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని విధాలుగా తనకు న్యాయం చేశారని చెప్పుకొచ్చారు అశోక్ గజపతిరాజు. పసుపు శుభసూచకమని, పసుపుని నమ్ముకున్న వారు ఎవరైనా బాగుంటారని తెలిపారు. కాగా, ఇవాళ(శుక్రవారం) సింహాచలం అప్పన్న స్వామిని కుటుంబ సమేతంగా అశోక్ గజపతిరాజు దర్శించుకున్నారు. ఆయనకు పూర్ణకుంభంతో అర్చక స్వాములు, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయం వద్ద అశోక్ గజపతిరాజును శాలువాతో మాజీమంత్రి అవంతి శ్రీనివాస్ సత్కరించారు.
ఇవి కూడా చదవండి..
నౌకాదళంలోకి స్వదేశీ ‘ఐఎన్‌ఎస్ నిస్తార్’
ఘోర ప్రమాదం.. లారీని వెనక నుంచి ఢీకొన్న కారు
Read latest AP News And Telugu News