Anitha:ఏపీలో ఎవరిపై అక్రమ కేసులు పెట్టడం లేదు: హోంమంత్రి అనిత
ABN , Publish Date - Jul 27 , 2025 | 06:14 PM
తమ ప్రభుత్వంలో చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. ఆర్గానిక్ వ్యవసాయం చేసే రైతుల సంఖ్య కూడా పెరుగుతోందని వెల్లడించారు. రాజకీయాల్లో యువతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఉద్ఘాటించారు.

అనకాపల్లి జిల్లా: రాష్ట్రంలో ఇప్పుడు ఎవ్వరిని అక్రమంగా అరెస్ట్‌లు చేయడం లేదని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anitha) క్లారిటీ ఇచ్చారు. ఇవాళ(ఆదివారం) పాయకరావుపేటలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల కమిటీ చైర్మన్‌ల ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత పాల్గొని మాట్లాడారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో కష్టపడిన వారికి నామినేటేడ్ పదవులు వస్తున్నాయని స్పష్టం చేశారు.
పనిచేసిన కార్యకర్తకు ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందని హోంమంత్రి అనిత ఉద్ఘాటించారు. ఒకప్పుడు వ్యవసాయం అంటే రైతులకు కష్టంగా ఉండేదని... ఇప్పుడు తాము రైతులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని నొక్కిచెప్పారు. అతి తక్కువ వడ్డీలతో రుణాలు, విత్తనాలు, ఎరువులు కూడా రైతులకు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఆర్గానిక్ వ్యవసాయం చేసే రైతుల సంఖ్య కూడా పెరుగుతోందని వెల్లడించారు. రాజకీయాల్లో యువతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఉద్ఘాటించారు హోంమంత్రి అనిత.
తమ ప్రభుత్వంలో చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. 2029 నాటికి పాయకరావుపేటలో స్టీల్ ఫ్లాంట్ అందుబాటులోకి వస్తోందని.. పెద్ద సంఖ్యలో ఉద్యోగావకాశాలు వస్తాయని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు పెట్టుబడుల కోసం సింగపూర్ వెళ్లారని...రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం ఎంతో కష్టపడతున్నారని ఉద్ఘాటించారు. చంద్రబాబు ఏపీలో పర్యటించినప్పుడు పరదాలు కట్టడం లేదని... కూటమి పాలనలో ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నామని చెబుతున్నారని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీలో పెట్టుబడులకు సింగపూర్ గ్రీన్ సిగ్నల్.. ప్రధానంగా ఈ రంగాల్లో
బద్వేల్‌లో ఉప ఎన్నిక.. ఆదినారాయణరెడ్డి ఏమన్నారంటే..
Read latest AP News And Telugu News