Share News

AP High Court : హైకోర్టులో ఘనంగా గణతంత్ర వేడుకలు

ABN , Publish Date - Jan 27 , 2025 | 04:23 AM

చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ హైకోర్టు ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.

AP High Court : హైకోర్టులో ఘనంగా గణతంత్ర వేడుకలు

  • జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన చీఫ్‌ జస్టిస్‌ ఠాకూర్‌

అమరావతి, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): హైకోర్టులో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ హైకోర్టు భద్రతా సిబ్బంది గౌరవ వందనం స్వీకరించారు. కోర్టు ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ మాట్లాడుతూ సమాజ పురోగమనానికి అవసరమైన లక్ష్యాలను సాధించడంతో పాటు భారతదేశ ప్రజాస్వామిక లక్ష్యాన్ని, రాజ్యాంగ పరిరక్షణ బాధ్యతను న్యాయవ్యవస్థ నిర్వహిస్తోందన్నారు. న్యాయవ్యవస్థ ప్రకాశవంతంగా పనిచేయడానికి, కోర్టులపై భారాన్ని తగ్గించడానికి న్యాయ సంస్కరణలు దోహదపడ్డాయన్నారు. అంతకుముందు హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.చిదంబరం, అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌, ఏపీ స్టేట్‌ బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ద్వారకానాథ్‌రెడ్డి మాట్లాడారు. స్వాతంత్ర సమరంలో న్యాయవాదులు కీలకపాత్ర పోషించారన్నారు. న్యాయవాదుల విజయాలు కోర్టు హాళ్లకే పరిమితం కాకూడదని, రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను అట్టడుగువర్గాలకు చేరేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మరోవైపు సచివాలయం సమీపంలోని ఏపీ న్యాయసేవాధికార సంస్థ వద్ద జరిగిన గణతంత్ర వేడుకల్లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరి జాతీయ జెండాను ఆవిష్కరించారు.


ఈ వార్తలు కూడా చదవండి

Vijayasai Reddy: విజయసాయిరెడ్డి భవిష్యత్తు ప్లాన్ ఇదేనా..!

Republic Day.. ఏపీలో రిపబ్లిక్ వేడుకలు.. అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర సన్నివేశం..

Republic Day.. బీజేపీకి రాజ్యాంగం అంటే గౌరవం లేదు: వైఎస్ షర్మిల

Updated Date - Jan 27 , 2025 | 04:26 AM