Share News

త్యాగధనులను స్మరించుకోవాలి: పల్లా శ్రీనివాస్‌

ABN , Publish Date - Jan 27 , 2025 | 05:05 AM

టీడీపీ కేంద్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

త్యాగధనులను స్మరించుకోవాలి: పల్లా శ్రీనివాస్‌

  • టీడీపీ కేంద్ర కార్యాలయంలో గణతంత్ర వేడుకలు

అమరావతి, జనవరి 26(ఆంధ్రజ్యోతి): దేశ ప్రజలంతా స్వేచ్ఛావాయువు పీల్చడానికి ఎందరో సమరయోధుల త్యాగాలే కారణమని, త్యాగధనులను ఎల్లప్పుడూ స్మరించుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పల్లా శ్రీనివాస్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాజ్యాంగ పరిరక్షణతో పాటు ప్రజల హక్కులను కాపాడుతూ, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఏపీని అభివృద్ధిలో శిఖరాగ్రాన నిలపడమే లక్ష్యంగా పని చేస్తోందని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాజారెడ్డి రాజ్యాంగం నడిచిందని, నేడు కూటమి పాలనలో అంబేద్కర్‌ రాజ్యాంగం అమలవుతోందని పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Vijayasai Reddy: విజయసాయిరెడ్డి భవిష్యత్తు ప్లాన్ ఇదేనా..!

Republic Day.. ఏపీలో రిపబ్లిక్ వేడుకలు.. అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర సన్నివేశం..

Republic Day.. బీజేపీకి రాజ్యాంగం అంటే గౌరవం లేదు: వైఎస్ షర్మిల

Updated Date - Jan 27 , 2025 | 05:05 AM