Share News

Call Money Case: కాల్‌మనీ దందా కేసులో.. వెలుగులోకి మహబూబ్ సుభానీ ఆగడాలు

ABN , Publish Date - Feb 12 , 2025 | 11:54 AM

Call Money Case: ఏపీలో కాల్‌మనీ మళ్లీ పడగ విప్పుతోంది. కాల్‌మనీ రాక్షసుల ధన దాహానికి చాలా మంది ప్రజలు బలవుతున్నారు. వేలల్లో తీసుకున్న అప్పుకు లక్షలు చెల్లించినా వడ్డీ వ్యాపారుల వేధింపులు ఆగడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో మరోసారి కాల్‌మనీ దందా తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది.

Call Money Case: కాల్‌మనీ దందా కేసులో.. వెలుగులోకి మహబూబ్ సుభానీ ఆగడాలు
Call Money Case

నెల్లూరు: కాల్‌మనీ రాక్షసులు మళ్లీ రెచ్చిపోతున్నారు. వారు చేస్తున్న అరాచకాలతో ప్రజలు భయాభ్రాంతులకు గురవుతున్నారు. తీసుకున్న అప్పుకు లక్షలకు లక్షలు వడ్డీలు కట్టినా వేధిస్తోండటంతో బాధితులు న్యాయం చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలోని కావలిలో మనీస్కాం(Money Scam) వెలుగు చూసింది. ఈ స్కాంలో సంచలన నిజాలు బయటపడ్డాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు మహబూబ్ సుభానీ (Mahaboob Subhani) ఆగడాలు మీతిమిరిపోయాయి ఇప్పుడు ఈ కేసు ఏపీలో సంచలనంగా మారింది. కావలిలో మనీస్కాం(Money Scam) ప్రధాన నిందితుడు మహబూబ్ సుభానీ (Mahaboob Subhani) రూ.వందల కోట్ల కుంభకోణాలను ఏబీఎన్ కథనాలతో వెలుగులోకి వచ్చింది.


ఏపీ, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మనీ స్కాంలు. మక్తల్, రాయచూర్, నరసరావుపేట, కాకినాడలో ఆర్థిక నేరాలువెలులుగోకి వచ్చాయి. కొన్నేళ్లుగా పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతూ కావలిలో మహబూబ్ సుభానీ మకాం వేసినట్లు పోలీసులు తెలిపారు.మక్తల్‌లో రూ.200కోట్లు స్వాహా చేసినట్లు మహబూబ్ సుభానీపై ఆరోపణలు వచ్చాయి. మక్తల్ ప్రాంత పీఎస్‌లలో మహబూబ్ సుభానీపై నాలుగు కేసులు నమోదయ్యాయి. ఏబీఎన్ కథనాలు చూసి కావలికి మక్తల్ బాధితులు చేరుకుంటున్నారు. కావలి ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డిని(MLA Kavya Krishna Reddy) ఫోనులో తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీహరి అభినందించారు. ప్రజలు మోసపోతున్న వైనాన్ని పసిగట్టి పోలీసులని అలెర్ట్ చేయడంపై కావ్యా కృష్ణారెడ్డిపై ప్రశంశలు కురిపించారు.


కాగా.. కావలిలో భారీ మనీ స్కాం బయటపడింది. ప్రజల నుంచి రూ. 78 కోట్లు వసూలు చేసి మహబూబ్ సుభానీ పరారయ్యాడు. ఎమ్మెల్యే కావ్య కృష్ణా రెడ్డి చొరవతో ఈ కుంభకోణం బహిర్గతమైంది. ఇందుకు సంబంధించి మహబూబ్ సుభానీపై పోలీసులకు పెద్ద సంఖ్యలో బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. ముసునూరులో సుభానీ ఏడాదిన్నర నుంచి అనంతర్థ అసోషియేట్స్ పేరుతో కార్యాలయం కొనసాగిస్తున్నాడు. కొందరు పోలీసులు అతనితో చేతులు కలిపి ప్రజల నుంచి భారీగా నగదు వసూలు చేశాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. మహబూబ్ సుభానీతో కలిసి పోలీసులే ఏజెంట్లుగా వ్యవహరించారు. మొదట్లో ఇద్దరు తహసీల్దార్లు, సీఐ, డీఎస్పీ ర్యాంక్ పోలీసు అధికారులు పెట్టుబడులు పెట్టి రూ. కోట్లలో రాబట్టుకున్నారు. మహబూబ్ సుభానీ పరారైన విషయం తెలుసుకుని బాధితులు అనంతర్థ అసోషియేట్స్ కార్యాలయం వద్దకు భారీగా వస్తున్నారు.

Updated Date - Feb 12 , 2025 | 12:15 PM