Local Body Funds: స్థానిక సంస్థల నిధులు వారికే.. ప్రభుత్వం వాడుకోదు: మంత్రి ఆనం
ABN , Publish Date - Jul 18 , 2025 | 04:38 PM
Local Body Funds: ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌ను ఇంటింటికీ వెళ్లి అధికారులు పంపిణీ చేశారని.. వాలెంటరీ వ్యవస్థ లేకుండానే అమలు చేశారని మంత్రి ఆనం చెప్పుకొచ్చారు. కేంద్రం ప్రవేశపెట్టిన జలజీవన్ మిషన్‌లో 28 వేల కోట్లు రూపాయలు ఇస్తామంటే, 2 వేల కోట్లు కూడా గత ప్రభుత్వం వినియోగించు కోలేదని విమర్శించారు.

నెల్లూరు, జులై 18: కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు త్వరలో వస్తున్నాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Minister Anam Ramanarayana Reddy) తెలిపారు. స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధులను కేంద్రం పంపనున్నట్లు మంత్రి వెల్లడించారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... స్థానిక సంస్థల నిధులను వాటికే కేటాయిస్తామని.. గత ప్రభుత్వం లాగా ఆ నిధులను కూటమి ప్రభుత్వం వాడుకోదని స్పష్టం చేశారు. సర్పంచ్‌లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు తమ ప్రాంతాలు అభివృద్ధి చేసుకునేందుకు ఈ ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు. గతంలో సచివాలయాలు ప్రారంభించి పూర్తి చేయకుండా వదిలేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఈ వ్యవస్థను గాడిలో పెట్టడానికి చర్యలు చేపట్టిందన్నారు.
ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌ను ఇంటింటికీ వెళ్లి అధికారులు పంపిణీ చేశారని.. వాలెంటరీ వ్యవస్థ లేకుండానే అమలు చేశారని చెప్పుకొచ్చారు. జలజీవన్ మిషన్ కింద రూ.28వేల కోట్లు కేంద్రం ఇస్తామంటే, కనీసం రూ.2వేల కోట్లు కూడా గత ప్రభుత్వం వినియోగించుకోలేదని విమర్శించారు. తల్లికి వందనం కింద నిధులను తల్లి అకౌంట్‌లో జమ చేశామని చెప్పుకొచ్చారు. మంత్రి లోకేష్ చిత్తశుద్ధిగా పథకం అమలు చేసిన తీరును అందరూ అభినందిస్తూ జెడ్పీ మీటింగ్‌లో తీర్మానం చేశామన్నారు. నాడు-నేడులో భాగంగా జిల్లాలో అసంపూర్తిగా నిలిచిన పాఠశాలల భవనాలను పూర్తి చేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
సైబర్ మోసాలు, బెట్టింగ్ యాప్‌లను అరికట్టేలా చట్టాల్లో మార్పులు: రఘురామకృష్ణంరాజు
2047 నాటికి నెం 1గా తెలుగు జాతి: నిమ్మల రామానాయుడు
Read latest AP News And Telugu News