TDP Parliamentary Meeting: టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ.. చర్చించే అంశాలివే
ABN , Publish Date - Jul 18 , 2025 | 04:00 PM
TDP Parliamentary Meeting: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ సమావేశం మొదలైంది. తొమ్మిది ప్రధాన అంశాలు అజెండాగా పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతోంది.

అమరావతి, జులై 18: తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. ఈరోజు(శుక్రవారం) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం మెుదలైంది. ఈనెల 21 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఏపీ ప్రయోజనాల కోసం అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల పరిష్కారం వంటి అంశాలపైనా చర్చించనున్నారు. తొమ్మిది ప్రధాన అంశాలు అజెండాగా పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతోంది.
తొక్కిసలాటలు- గుంపుల నియంత్రణలో నిర్వహణ లోపాలు, వివిధ కేంద్ర పథకాల ద్వారా రుణాల మంజూరులో జాప్యం, మహిళా ప్రజాప్రతినిధులపై సోషల్ మీడియాలో అసభ్య ప్రచారం వంటి అంశాలపైనా చర్చించనున్నారు. రాష్ట్రానికి ఏరోస్పేష్ ఇండస్ట్రీ, స్పేస్ సిటీ, పోలవరం - బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు ఇబ్బందులు, హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు, రాష్ట్రానికి విదేశీ పెట్టుబడుల అంశంపై పార్లమెంటరీ పార్టీ చర్చించనుంది. అమరావతి కేంద్రంగా క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు, అమరావతి అభివృద్ధికి కేంద్రం చర్యలు, మామిడి ధర తగ్గిపోవటం వల్ల రైతులకు నష్టంపై వంటి అంశాలు చర్చకు రానున్నాయి. పార్లమెంటరీ పార్టీ సమావేశానికి పలువురు లోక్‌సభ, రాజసభ సభ్యులు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి..
సైబర్ మోసాలు, బెట్టింగ్ యాప్‌లను అరికట్టేలా చట్టాల్లో మార్పులు: రఘురామకృష్ణంరాజు
2047 నాటికి నెం 1గా తెలుగు జాతి: నిమ్మల రామానాయుడు
Read latest AP News And Telugu News