Money Scam Case: కావలి కాల్ మనీస్కాం కేసులో దూకుడు పెంచిన పోలీసులు
ABN , Publish Date - Feb 13 , 2025 | 07:55 AM
Money Scam Case: కాల్‌మనీ రాక్షసులు మళ్లీ రెచ్చిపోతున్నారు. వారు చేస్తున్న అరాచకాలతో ప్రజలు భయాభ్రాంతులకు గురవుతున్నారు. తీసుకున్న అప్పుకు లక్షలకు లక్షలు వడ్డీలు కట్టినా వేధిస్తోండటంతో బాధితులు న్యాయం చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

నెల్లూరు: కావలి మనీస్కాం(Money Scam) కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాలతో కావలి మనీస్కాంపై ముమ్మరంగా విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో కీలక ఆధారాలను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకువచ్చింది. మనీస్కాంలో పోలీసులు, పోలీసు, రెవెన్యూ అధికారుల పాత్ర బయటపడుతోంది. ఇప్పటికే రాధాకృష్ణ, అయోధ్య అనే ఇద్దరు పోలీసులను ఎస్పీ సస్పెండ్ చేశారు. వారితో పాటు కుటుంబ సభ్యుల బ్యాంకు అకౌంట్లలో భారీ నగదు గుర్తించారు. రూ.కోట్లతో స్థలాలు, పొలాలు కొనుగోలు, భారీ భనాలను నిర్మించినట్లు విచారణలో వెల్లడైంది.
రాధాకృష్ణ నుంచి ఓ సీఐ సుమారు రూ.60లక్షల నగదు చేబదులు తీసుకున్నట్లు సమాచారం. పలువురు పోలీసు అధికారులు, ఇద్దరు తహసీల్దార్లకు పెద్ద మొత్తాల్లో లబ్ధి చేకూరినట్లు తెలుస్తోంది. ఐడీ పార్టీ విభాగంలో పనిచేసే ఓ కానిస్టేబుల్ రూ.కోటి వరకు పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. బిట్రగుంట పీఎస్‌లో పనిచేసే మరో కానిస్టేబుల్ రూ.60లక్షలు చెల్లించినట్లు గుర్తించారు. ప్రధాన నిందితుడు మహాబూబ్ సుభానీ (Mahaboob Subhani) కోసం పోలీసు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఏపీ, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లోనూ రూ.వందల కోట్లలో మోసాలు బయటపడ్డాయి. కావలికి వచ్చి ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డికి బాధితులు మొరపెట్టుకుంటున్నారు.
కాగా.. కాల్‌మనీ రాక్షసులు మళ్లీ రెచ్చిపోతున్నారు. వారు చేస్తున్న అరాచకాలతో ప్రజలు భయాభ్రాంతులకు గురవుతున్నారు. తీసుకున్న అప్పుకు లక్షలకు లక్షలు వడ్డీలు కట్టినా వేధిస్తోండటంతో బాధితులు న్యాయం చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలోని కావలిలో మనీస్కాం వెలుగు చూసింది. ఈ స్కాంలో సంచలన నిజాలు బయటపడ్డాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు మహబూబ్ సుభానీ ఆగడాలు మీతిమిరిపోయాయి ఇప్పుడు ఈ కేసు ఏపీలో సంచలనంగా మారింది. కావలిలో మనీస్కాం ప్రధాన నిందితుడు మహబూబ్ సుభానీరూ.వందల కోట్ల కుంభకోణాలను ఏబీఎన్ కథనాలతో వెలుగులోకి వచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News