Home Minister Anitha: బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది..
ABN , Publish Date - Oct 24 , 2025 | 08:40 AM
కర్నూల్ జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ట్రావెల్ బస్సు ప్రమాదంపై హోం మంత్రి అనిత స్పందించారు. ప్రమాద సమయంలో బస్సులోనే చాలామంది ప్రయాణికులు సజీవదహనం అవ్వడం అత్యంత విచారకరమన్నారు.
అమరావతి: కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదంపై హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు దగ్ధమైన ఘటనలో పలువురు చనిపోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మరణించిన కుటుంబాలకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు. అనంతరం క్షతగాత్రులకు తక్షణ వైద్య సహాయం అందించాలని ఉన్నతాధికారులకు ఆదేశించారు. ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకుంటున్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మరికొద్దిసేపట్లో హోం మంత్రి అనిత ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నట్లు సమాచారం.
అన్ని విధాలుగా అండగా ఉండాలి : షర్మిల
కర్నూల్ జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ట్రావెల్ బస్సు ఘోర ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ప్రమాద సమయంలో బస్సులోనే చాలామంది ప్రయాణికులు సజీవదహనం అవ్వడం అత్యంత విచారకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని, మృతుల సంఖ్య పెరగకుండా క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని షర్మిల కోరారు. మరణించిన వారి కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రమాద ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరపాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
మృతుల కుటుంబాలకు సంతాపం : మంత్రి సవిత
కర్నూల్ బస్సు దగ్ధంపై మంత్రి సవిత స్పందించారు. దుర్ఘటనపై విచారం వ్యక్తం చేశారు. అనంతరం మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యమందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే.. ప్రమాద స్థలంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి సవిత ఉద్ఘాటించారు.
ఇవి కూడా చదవండి..
Election Commission: సర్‌కు సన్నాహాలు చేయండి
Chennai: నాన్నే నేరస్తుడని నమ్మించేలా అమ్మను చంపేశాడు