YSRCP Leader Kondareddy case: వైసీపీకి బిగ్ షాక్.. కొండారెడ్డి కేసులో మరో కీలక పరిణామం
ABN , Publish Date - Nov 26 , 2025 | 08:30 AM
వైసీపీ విద్యార్థి విభాగం నేత కొండారెడ్డిపై నమోదైన డ్రగ్స్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయనపై పీటీ వారెంట్‌ను అనుమతించింది విజయవాడ కోర్టు.
విజయవాడ, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): వైసీపీ విద్యార్థి విభాగం నేత కొండారెడ్డి (YSRCP Leader Kondareddy)పై నమోదైన డ్రగ్స్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయనపై పీటీ వారెంట్‌ను అనుమతించింది విజయవాడ కోర్టు. ఇంజనీరింగ్ విద్యార్థులతో బెంగళూరు నుంచి డ్రగ్స్‌ను ఏపీకి ఆయన తెప్పించుకున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. బెంగళూరు నుంచి ఎండీఎంఏ, ఎల్‌ఎస్‌డీ డ్రగ్స్‌ను ఏపీకి తీసుకువస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థులను ఆగస్టులో విజయవాడలో పట్టుకున్నాయి ఈగల్, టాస్క్‌ఫోర్స్ బృందాలు.
ఈ కేసులోనే ఇటీవల బెంగళూరులో డ్రగ్స్ సరఫరా చేస్తున్న మల్లెల మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రిమాండ్‌లో ఉన్న మల్లెల మధుసూదన్ రెడ్డి, జోగా రోహిత్ యాదవ్‌లను పోలీసులు విచారణ చేశారు. ఈ క్రమంలో వారు ఇచ్చిన వాంగ్మూలంలో కొండారెడ్డి పేరు వెలుగులోకి వచ్చింది. కొండారెడ్డిని కేసులో నిందితుడిగా చేర్చి మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టులో దాఖలు చేసిన పీటీ వారెంట్‌కు అనుమతి ఇచ్చారు న్యాయాధికారి సత్యానంద్.
డ్రగ్స్ కేసులో వైసీపీ విద్యార్థి నేత కొండారెడ్డికి పీటీ వారెంట్ జారీ అయింది. ఈ కేసులో కొండారెడ్డి ప్రమేయంపై ఆధారాలు బయటపడటంతో మాచవరం పోలీసులు నిందితుడిగా చేర్చారు. ప్రస్తుతం నిందితుడు డ్రగ్స్ కేసులో విశాఖపట్నంలో అరెస్టు అయ్యారు. రిమాండ్ నిమిత్తం విశాఖలోని కేంద్ర కారాగారంలో ఆయనను ఉంచారు. ఈ క్రమంలోనే విజయవాడ కోర్టులో హాజరుపరిచేందుకు పీటీ వారెంట్ జారీ చేయాలని కోర్టు అనుమతిని కోరారు. శనివారంలోపు విజయవాడ కోర్టులో హాజరు పరచనున్నారు పోలీసులు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆర్టీసీ బస్సులో పొగలు.. ఏమైందంటే..
ఏపీలో భారీ అగ్నిప్రమాదం.. బ్యాంకులో ఒక్కసారిగా మంటలు..
Read Latest AP News And Telugu News