Share News

Breaking News: నగర ప్రజలకు బిగ్ అలర్ట్

ABN , Publish Date - Oct 27 , 2025 | 07:15 PM

విజయవాడ నగర ప్రజలకు జిల్లా ఉన్నతాధికారులు కీలక సూచనలు చేశారు. మంగళవారం విజయవాడలో అతి భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు జిల్లా అధికారులు హెచ్చరించారు.

Breaking News: నగర ప్రజలకు బిగ్ అలర్ట్

విజయవాడ, అక్టోబర్ 27: మొంథా తుపాన్ కారణంగా కోస్తా ప్రాంతంలోని వివిధ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ క్రమంలో మంగళవారం అంటే.. అక్టోబర్ 28వ తేదీన విజయవాడ నగరంలో సుమారు 162 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశా, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. ఈ విషయాన్ని వాతావరణ శాఖ వెల్లడించిందని చెప్పారు.


ఈ నేపథ్యంలో అత్యవసర సేవల కోసం తప్ప బయటకు రావద్దని నగర ప్రజలకు వారు సూచించారు. సోమవారం తుపాన్ పరిస్థితులపై ఉన్నతాధికారులతో వారు సమీక్ష నిర్వహించారు. జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇళ్లలోనే ఉండాలని నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే అన్ని దుకాణాలతోపాటు వాణిజ్య సంస్థలు మూసివేయాలని ఆదేశించారు.


మెడికల్ షాపులు, కూరగాయలు, పాలు విక్రయ కేంద్రాలు తదితర సేవా కేంద్రాలు తెరిచి ఉంచాలన్నారు. ఇక అవసరం లేని ప్రయాణాలు, షాపింగ్, వినోదం, మార్నింగ్ వాక్, పార్కుల సందర్శన తదితర కార్యక్రమాలు వాయిదా వేసుకోవాలని నగర ప్రజలకు మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర స్పష్టం చేశారు.


డిస్ట్రిక్ట్ కమాండ్ కంట్రోల్ రూమ్ 9154970454, అలాగే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 0866 2424172‬, 0866 2422515‬, 0866 2427485.. అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించాలని సూచించారు. ఈ మేరకు విజయవాడ నగర పాలక సంస్థ పీఆర్వో ప్రకటన విడుదల చేసింది.

ఇవి కూడా చదవండి:

రైళ్లు రద్దుపై రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ప్రయాణికులకు కీలక సూచన

ఆ ప్రాంతాల్లో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి

For More AP News And Telugu News

Updated Date - Oct 27 , 2025 | 08:15 PM