AP News: కొడుకు ప్రవర్తనతో విసిగిపోయిన తండ్రి.. ఏం చేశాడంటే..
ABN , Publish Date - Jul 01 , 2025 | 08:51 AM
ఎన్టీఆర్ జిల్లాలో కసాయి కొడుకుని ఓ తండ్రి కడతేర్చాడు. జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేట గ్రామంలో తండ్రి కొడుకుల కొట్లాటలో కొడుకుని తండ్రి చంపివేశాడు.

ఎన్టీఆర్ జిల్లా (జగ్గయ్యపేట): తమ సంతానంపై తల్లిదండ్రులు ఎంతో ప్రేమ పెంచుకుంటారు. అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేస్తారు. కానీ చివరికి పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులను కన్న కొడుకు తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడు. కొడుకు ప్రవర్తనతో విసిగిపోయిన తండ్రి తన పేగు బంధాన్ని కూడా తెంచ్చుకునే స్థితికి తీసుకువచ్చాడు ఓ కసాయి కొడుకు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేట గ్రామంలో ఓ తండ్రి తన కసాయి కొడుకును అతి దారుణంగా హత్య చేశాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేట గ్రామంలో వెంకట నారాయణ (35) అనే వ్యక్తి తాగుడుకు బానిస అయ్యాడు. రోజూ పీకల దాక తాగి ఇంటికి వచ్చి తన తల్లిదండ్రులను కొడుతుండేవాడు. తమను కొట్టవద్దని, తాగుడు బంద్ చేయాలని తల్లిదండ్రులు ఎన్నోసార్లు వెంకటనారాయణకు నచ్చచెప్పారు. కానీ వెంకన్నారాయణ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. నిన్న(సోమవారం) రాత్రి సమయంలో పీకల దాక తాగి ఇంటికి వచ్చి తన తల్లిదండ్రులతో వెంకట నారాయణ గొడవ పడి వారిని విచక్షణ రహితంగా కొట్టాడు. చివరికి తండ్రి కొడుకులకు మధ్య జరిగిన కొట్లాటలో కొడుకుని తండ్రి చంపివేశాడు.
రాత్రి 10 గంటల సమయంలో బాగా మందు తాగి తల్లిదండ్రులను వెంకటనారాయణ కొట్టాడు. ఈ క్రమంలో తండ్రి గోళ్ల కృష్ణ కుమారుడిని చెక్క మొద్దుతో కొట్టడంతో అక్కడికక్కడే వెంకటనారాయణ మృతి చెందాడు. ఈ ఘటనపై ఎన్టీఆర్ జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. వెంకటనారాయణకి కృష్ణ కుమారితో సుమారు 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు, కూతురు ఉన్నారు. ఐదు సంవత్సరాల క్రితం భర్తను వదిలేసి భార్య కృష్ణకుమారి వెళ్లిపోయింది.
ఇవి కూడా చదవండి:
రెండు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
త్రిభాషా విధానంపై వెనక్కి తగ్గిన మహారాష్ట్ర
ఉక్రెయిన్‌పై రష్యా డ్రోన్లు, క్షిపణుల వర్షం..
For More AP News and Telugu News