CPR Saves Life: శభాష్ పోలీస్ .. నడుస్తూనే కుప్పకూలిన వ్యక్తి.. సీపీఆర్ చేసి ప్రాణాలు నిలిపిన పోలీసులు
ABN , Publish Date - Feb 23 , 2025 | 07:57 PM
Police Save Life with CPR: రోడ్డుపై పడి అపస్మారక స్థితిలో ఉన్న ఓ వ్యక్తికి పోలీసులు సీపీఆర్ చేసి ప్రాణం పోసిన ఘటన ఆదివారం ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జరిగింది. ఆర్టీసీ డ్రైవర్ నడుచుకుంటూ వెళ్తూ ఒక్కసారిగా కిందపడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. విధులు నిర్వహిస్తున్న పోలీసులు అతడు గుండెనొప్పితో పడిపోయినట్లు గ్రహించి ఆ వ్యక్తికి సీపీఆర్ చేసి ఊపిరి పోశారు. అనంతరం అతడిని అంబులెన్స్‌లో సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

ఎన్టీఆర్ జిల్లా: ఇటీవల ఎవరికి ఎప్పుడు ఎందుకు గుండెపోటు వస్తుందో చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. ఇలా చాలా మంది తమ నిండు ప్రాణాలు కోల్పోతున్నారు. మధ్య వయసు వారి నుంచి చిన్న పిల్లల వరకు.. కళ్ల ముందే కుప్పకూలిపోతూ క్షణాల్లో ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటనలెన్నో మన ముందు కనిపిస్తున్నాయి. ఇలాంటి విపత్కర ఘటనలు ఎదురైన సమయంలో.. సీపీఆర్ చేసి ఆఖరి క్షణాల్లోనూ వారి ప్రాణాలను కాపాడవచ్చనే విషయాన్ని ప్రజలకు ప్రభుత్వాలు, పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు, ఇలాంటి సమయంలోనే పోలీసుల సమయస్ఫూర్తితో సీపీఆర్ చేసి ఓ నిండు ప్రాణాన్ని బతికించారు ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జరిగింది.
అసలు ఏం జరిగిందంటే..
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సృహ తప్పి పడిపోయిన ఆర్టీసీ డ్రైవర్‌కు సీపీఆర్ చేసి పోలీసులు ప్రాణం కాపాడారు. నందిగామ అశోక్ నగర్‌కు చెందిన ఆర్టీసీ డ్రైవర్ రమేష్ డ్యూటీకి బయలుదేరారు. అయితే రోడ్డుపై నడుస్తుండగా ఆకస్మాత్తుగా రమేష్ సృహ కోల్పోయి కిందపడిపోయాడు. 112కి కాల్ చేయడంతో పోలీసులు వెంటనే స్పందించారు. సంఘటన స్థలానికి కానిస్టేబుల్ సంతోష్, పుల్లారావు చేరుకున్నారు. సృహ కోల్పోయిన రమేష్‌కు పోలీసులు సీపీఆర్ చేశారు. అనంతరం నందిగామ ప్రభుత్వ హాస్పటల్‌కు తరలించారు. ఎంతో సమయస్ఫూర్తిగా వ్యవహరించి వ్యక్తి ప్రాణాలను కాపాడిన పోలీసులను పలువురు అభినందించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Rammohan Naidu: ఏపీలో శాంతిభద్రతల సమస్య సృష్టించడానికి వైసీపీ కుట్ర
YSRCP: రాష్ట్రంలో రెండే రెండు పథకాలు అమలు అవుతున్నాయి: కన్నబాబు
YS Jagan: ఈ గేట్ నుండే అసెంబ్లీకి జగన్..
YSRCP: జగన్ ఎక్కడికి వెళ్ళినా జెడ్ ప్లస్ భద్రత కల్పించాలి: వైవి సుబ్బారెడ్డి
Read Latest AP News and Telugu News