Fire incident:ఏపీలో భారీ అగ్నిప్రమాదం.. బ్యాంకులో ఒక్కసారిగా మంటలు..
ABN , Publish Date - Nov 26 , 2025 | 07:06 AM
కృష్ణా జిల్లాలోని గుడివాడ యూనియన్ బ్యాంకులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బైపాస్ రోడ్డులోని బ్యాంక్ కార్యాలయం నుంచి ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
కృష్ణా జిల్లా , నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జిల్లాలోని గుడివాడ యూనియన్ బ్యాంకులో ఇవాళ (బుధవారం) తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం (Fire incident) జరిగింది. బైపాస్ రోడ్డులోని బ్యాంకు కార్యాలయం నుంచి ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. సంఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. బ్యాంకు అద్దాలు పగలగొట్టి మంటలను అదుపు చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. మంటలు ఇంకా అదుపులోకి రాలేదు.
ఈ ఘటనలో బ్యాంకులోని కంప్యూటర్లు, ఫర్నిచర్ దగ్ధమైనట్లు తెలుస్తోంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని బ్యాంక్ అధికారులు భావిస్తున్నారు. స్థానికులను సంఘటన స్థలం నుంచి దూరంగా పంపించి వేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆర్టీసీ బస్సులో పొగలు.. ఏమైందంటే..
జగన్ హయాంలో రైతులు నష్టపోయారు.. ఎంపీ కలిశెట్టి ఫైర్
Read Latest AP News And Telugu News