Share News

Mahesh Chandra Ladda: చరిత్రలో ఇదే ప్రథమం.. మావోల అరెస్ట్‌పై ఏడీజీ

ABN , Publish Date - Nov 19 , 2025 | 09:20 AM

మారేడుమిల్లిలో జరిగిన ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన వివరాలను అడిషనల్ డీజీ మహేష్ చంద్ర లడ్డా తెలియజేశారు. నిన్నటి ఎన్‌కౌంటర్‌లో హిడ్మా, మరో ఐదుగురు చనిపోయినట్లు చెప్పారు.

Mahesh Chandra Ladda: చరిత్రలో ఇదే ప్రథమం.. మావోల అరెస్ట్‌పై ఏడీజీ
Mahesh Chandra Ladda

విజయవాడ, నవంబర్ 19: మారేడుమిల్లిలో ఎన్‌కౌంటర్, ఏపీలోని ఐదు జిల్లాల్లో పట్టుబడిన మావోయిస్టులకు సంబంధించిన వివరాలను అడిషనల్ డీజీ మహేష్ చంద్ర లడ్డా (ADG Mahesh Chandra Ladda) మీడియాకు వివరించారు. మారేడుమిల్లిలో ఎన్‌కౌంటర్, ఏపీలో ఐదు జిల్లాలో పట్టుబడిన మావోయిస్టులకు సంబంధించిన వివరాలను అడిషనల్ డీజీ మహేష్ చంద్ర లడ్డా మీడియాకు వివరించారు. అంతేకాకుండా ఈరోజు కూడా ఏజెన్సీలో నక్సల్స్, పోలీసులకు మధ్య కాల్పులు జరిగినట్లు తెలిపారు. ఉదయం ఏడు గంటల సమయంలో ఏజెన్సీలో కాల్పులు జరిగాయని.. ఏడుగురు నక్సలైట్స్ చనిపోయారని తెలిపారు. వీరిలో నలుగురు పురుషులు, ముగ్గరు మహిళలు ఉన్నారన్నారు.


వారిని పూర్తిగా గుర్తించాల్సి ఉందని చెప్పారు. మారేడుమిల్లిలో నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌ ప్రాంతానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈరోజు ఎన్‌కౌంటర్ జరిగినట్లు వెల్లడించారు. చనిపోయిన వారిలో జ్యోగారావు అలియాస్ టేక్ శంకర్ ఒక్కరినే గుర్తించామని తెలిపారు. శ్రీకాకుళానికి చెందిన జ్యోగారావు పదేళ్లుగా మావోగా ఉన్నారని.. ఇతర సమాచారాన్ని త్వరలోనే వెల్లడిస్తామని ఏడీజీ తెలిపారు.


ఏడీజీ ఇంకా మాట్లాడుతూ.. ఛత్తీస్‌గఢ్ నుంచి ఏపీకి రావాలని మావోయిస్టులు ప్రయత్నం చేస్తున్నారన్నారు. నిఘా వర్గాలు వారి కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు. నవంబరు 17న కీలకమైన ఆపరేషన్ చేపట్టామని.. నిన్న మారేడుమిల్లిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా, మరో ఐదుగురు ఎన్ కౌంటర్‌లో చనిపోయినట్లు చెప్పారు. వాళ్ల నుంచి సేకరించిన సమాచారంతో ఎక్కడెక్కడ మావోయిస్టులు ఉన్నారని దృష్టి పెట్టామని అడిషనల్ డీజీ వెల్లడించారు. ఎన్టీఆర్‌, కృష్ణా, కాకినాడ, ‌కోనసీమ, ఏలూరు జిల్లాల నుంచి యాభై మంది మావోయిస్టులను పట్టుకున్నట్లు తెలిపారు. ఎక్కడా ఎవరికీ ప్రమాదం జరగకుండా ఆపరేషన్ పూర్తి చేశామన్నారు.


రాష్ట్ర చరిత్రలో ఇంతమంది కీలక వ్యక్తులను పట్టుకోవడం ఇదే ప్రథమమన్నారు. కేంద్ర, రాష్ట్ర, ఏరియా, కమిటీ సభ్యులు, ఫ్లాటూన్ టీంలను పట్టుకున్నట్లు తెలిపారు. వారిని నుంచి వెపన్స్ 45, 272 రౌండ్స్, రెండు మ్యాగజైన్, 750 గ్రాముల వైర్, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామన్నారు. తమ ఫీల్డ్ సిబ్బంది ప్రణాళిక ప్రకారం ఆపరేషన్ పూర్తి చేశారన్నారని.. ఇందులో పాల్గొన్న వారందరికీ అభినందనలు తెలియజేశారు. ఇంటిలిజెన్స్ విభాగం ఈ విషయంలో బాగా పని చేసిందని కొనియాడారు. ముందే సమాచారం వచ్చినప్పటికీ వారిపై నిఘా పెట్టామని.. వారి ఆలోచనలు, కార్యకలాపాలను గమనించినట్లు వివరించారు.


అన్నీ సెట్ చేసుకున్నాక ఒకేసారి వారందరినీ పట్టుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది ఇటీవల సరెండర్ అయ్యారని.. వాళ్ల ద్వారా సమాచారం వెళితే ఇబ్బందులు ఉంటాయని మావోలు భావించారన్నారు. అందుకే కొన్ని రోజులు షెల్టర్ తీసుకునేందుకు ఏపీలో పలు ప్రాంతాలను ఎంచుకున్నారనట్లు చెప్పుకొచ్చారు. మళ్లీ సమయం చూసి వాళ్ల ప్రాంతాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారని.. మావోల మూవ్‌మెంట్, ప్లాన్లపై ఇతర సమాచారం లేదన్నారు. హిడ్మాను పట్టుకున్నాక చంపామనే ప్రచారంలో నిజం లేదని అడిషనల్ డీజీ మహేష్ చంద్ర లడ్డా స్పష్టం చేశారు.


కమాండ్ కంట్రోల్ రూమ్‌కు మావోలు..

మరోవైపు పట్టుబడ్డ 50 మంది మావోయిస్టులను కమాండ్ కంట్రోల్ రూమ్‌కు తరలించారు. భారీ భద్రత నడుమ మావోయిస్టులను ఏలూరు , కాకినాడ, కోనసీమ, కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాల నుంచి కమాండ్ కంట్రోల్ రూమ్‌కు పోలీసులు తరలించారు. అలాగే ఆ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. ఇప్పటికే 5 జిల్లాల ఎస్పీలు ,రేంజ్ ఐజీలు కమాండ్ రూమ్‌కు చేరుకున్నారు. మావోయిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్న రైఫిల్స్, పిస్టల్స్, డిటోనేటర్లు, మ్యాగ్జైన్లు ,మొబైల్స్, సిమ్ కార్డులు,పెన్ డ్రైవ్‌లు, విప్లవ సాహిత్యం, హిడ్మా ఫొటోలను స్వాధీనం చేసుకుని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు పోలీసులు తరలించారు.


ఇవి కూడా చదవండి...

నేడు ప్రధాని మోదీ పుట్టపర్తికి రాక

అన్నదాతకు డబుల్‌ ధమాకా

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 19 , 2025 | 10:04 AM