Devineni Uma Slams Jagan: తప్పుడు ప్రచారాలతో సీఎం చంద్రబాబుపై విషం కక్కుతున్నారు.. జగన్‌పై దేవినేని ఫైర్
ABN , Publish Date - Jul 29 , 2025 | 09:24 PM
ఐదేళ్ల విధ్వంస పాలనతో జగన్ వేలకోట్ల దోపిడీ చేశారని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. మళ్లీ ఇప్పుడు జగన్ అండ్ కో శ్రీరంగ నీతులు చెబుతున్నారా అని మండిపడ్డారు. సీబీఐ ఈడీ క్రిమినల్ కేసుల్లో డిశ్చార్జి పిటిషన్లు వేసుకుంటూ కాలం వెళ్లదీస్తూ ప్రజాస్వామ్యం అంటూ నీతి సూత్రాలు చెబుతున్న జగన్ రెడ్డి కోర్టు మెట్లు ఎక్కక తప్పదని దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శలు చేశారు.

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) తెలుగుదేశం సీనియర్ నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్‌ని కలిసిన జగన్ ఏ సమస్యలపై మాట్లాడారో.. మీడియా ముందుకు వచ్చి ఎందుకు చెప్పలేకపోయారని ప్రశ్నించారు. రూ.3750 కోట్ల మద్యం కుంభకోణంలో బిగ్ బాస్ జగన్ మోహన్ రెడ్డేనని ఆరోపించారు. నాసిరకం మద్యం కుంభకోణంలో జగన్ భాగస్వామిగా మారి వైసీపీ ఎంపీ మిధున్‌రెడ్డి రాజమండ్రి జైల్లో చిప్పకూడు తింటున్నారని ఎద్దేవా చేశారు. ఇవాళ(మంగళవారం) అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో దేవినేని ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడారు.
ఏపీ ప్రతిష్ట పునరుద్ధరింపజేస్తూ సీఎం చంద్రబాబు.. సింగపూర్ పర్యటన చేస్తుంటే తప్పుడు ప్రచారాలతో జగన్మోహన్ రెడ్డి విషం కక్కుతున్నారని దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. చెవిరెడ్డి గురించి శోకాలు పెట్టే జగన్ రెడ్డి విజయవాడ జైల్లో ఉన్న లిక్కర్ ముద్దాయిలను ఎందుకు కలవడం లేదని నిలదీశారు. ఒక శాసనసభ్యుడిగా పులివెందుల సమస్యలు కూడా శాసనసభకు వెళ్లి మాట్లాడలేనందుకు జగన్ సిగ్గుపడాలని విమర్శించారు. జగన్ రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే ఐదేళ్లలో దోచుకున్న వేల కోట్లు కంటైనర్లని ఎక్కడికి తరలించారో చెప్పాలని సవాల్ విసిరారు దేవినేని ఉమామహేశ్వరరావు.
మాజీ మంత్రి వివేకారెడ్డి హత్య కేసులో ముద్దాయిలు ఎవరో విజయవాడ ప్రెస్ క్లబ్‌లో జగన్ మీడియా సమావేశం పెట్టి సమాధానం చెప్పాలని దేవినేని ఉమామహేశ్వరరావు ఛాలెంజ్ చేశారు. ఏపీ అభివృద్ధిలో భాగస్వాములు అవుతామని వచ్చి జగన్ వల్లే తాము వెనక్కి వెళ్లిపోయామని సింగపూర్ మంత్రి చెప్పారని గుర్తుచేశారు. మళ్లీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి వస్తామంటున్న సింగపూర్ మంత్రి మాటలకు జగన్ అండ్ కో ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. వైసీపీ విధ్వంసంతో భయపెట్టి వెళ్లగొట్టిన సింగపూర్ కంపెనీలను చంద్రబాబు మళ్లీ రాష్ట్రానికి రప్పిస్తుంటే జగన్ తట్టుకోలేకపోతున్నారని ఆక్షేపించారు. ఐదేళ్ల విధ్వంస పాలనతో జగన్ వేలకోట్ల దోపిడీ చేశారని ధ్వజమెత్తారు. మళ్లీ ఇప్పుడు జగన్ అండ్ కో శ్రీరంగ నీతులు చెబుతున్నారా అని మండిపడ్డారు. సీబీఐ ఈడీ క్రిమినల్ కేసుల్లో డిశ్చార్జి పిటిషన్లు వేసుకుంటూ కాలం వెళ్లదీస్తూ ప్రజాస్వామ్యం అంటూ నీతి సూత్రాలు చెబుతున్న జగన్ రెడ్డి కోర్టు మెట్లు ఎక్కక తప్పదని దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శలు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
గుడ్ న్యూస్.. రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏనుగుల గుంపు కదలికలపై వాట్సాప్ ద్వారా హెచ్చరికలు.. పవన్ కల్యాణ్ న్యూ ప్లాన్
Read latest AndhraPradesh News And Telugu News