Devineni Uma: అలా చెప్పే దమ్ము, ధైర్యం లేదా?... జగన్‌పై మండిపడ్డ దేవినేని
ABN , Publish Date - Nov 21 , 2025 | 03:36 PM
జగన్‌పై మాజీ మంత్రి దేవినేని ఉమా ఫైర్ అయ్యారు. అక్రమాస్తుల కేసులో జగన్ కోర్టుకు హాజరయ్యారని చెప్పే దమ్ము, ధైర్యం బ్లూ మీడియాకు లేదంటూ మండిపడ్డారు. జగన్ ఆర్థిక ఉగ్రవాది అంటూ వ్యాఖ్యలు చేశారు.
అమరావతి, నవంబర్ 21: మాజీ సీఎం జగన్‌పై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు (Former Minister Devineni Uma Maheshwar Rao) మరోసారి విరుచుకుపడ్డారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో పేదవాడైనా, సంపన్నుడైనా అందరికీ ఒకటే న్యాయమని.. చట్టం ముందు అందరం సమానమే అని అన్నారు. వేల కోట్లు దోచేసి సాక్షి, భారతి సిమెంట్స్‌లో జగన్ రెడ్డి పెట్టుబడులు పెట్టారని ఆరోపించారు. ప్రజల ఆస్తులు, ప్రభుత్వ భూములు దోచుకొని ఆర్థిక ఉగ్రవాదానికి జగన్ రెడ్డి పాల్పడ్డారంటూ మండిపడ్డారు. గతంలో తండ్రి వైఎస్సార్ అధికారాన్ని అడ్డంపెట్టుకొని జగన్ రూ. 43 వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.
జగన్ ఆర్థిక నేరాలపై 11 సీబీఐ, 9 ఈడీ ఛార్జిషీట్లు ఫైల్ అయ్యాయని అన్నారు. అక్రమాస్తుల కేసులో జగన్ రెడ్డి కోర్టుకు హాజరయ్యారని చెప్పే దమ్ము, ధైర్యం బ్లూ మీడియాకు లేదని మండిపడ్డారు. తనకు ఫోనే లేదని చెప్పిన జగన్ రెడ్డి యూరప్ పర్యటన సందర్భంగా న్యాయస్థానానికి ఇచ్చిన నెంబర్ ట్రాక్ కాలేదన్నారు.
ప్రజల పక్షాన పోరాటాలు చేసినందుకు తనపై తండ్రి, కొడుకులు తొంభై కేసులు పెడితే 19 ఏళ్లుగా వాయిదాలకు తిరుగుతున్నట్లు చెప్పుకొచ్చారు. పక్క రాష్ట్రాల్లో ఉండి ఏపీపై విషం చిమ్ముతున్న బ్లూ మీడియా ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. సిద్ధం సిద్ధం అంటే ప్రజలు 11 ఇచ్చారని.. ఇక రప్పా.. రప్పా అంటే ఒక్క సీటుకే పరిమితం చేస్తారంటూ మాజీ మంత్రి దేవినేని ఉమా వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి..
సోషల్ మీడియాలో రైతుల పోస్టులపై మంత్రి నారాయణ రియాక్షన్
పోస్టుమార్టంలో జాప్యం.. ఆస్పత్రిలోనే మావోల డెడ్‌బాడీస్
Read Latest AP News And Telugu News