Share News

Devineni Uma: జగన్ ప్రతిపక్షానికి కూడా పనికిరాడు.. దేవినేని ఉమ సెటైర్లు

ABN , Publish Date - Jul 07 , 2025 | 02:36 PM

ప్రజాస్వామ్యమన్నా, కోర్టులన్నా జగన్ రెడ్డికి లెక్క లేకుండా పోయిందని మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. పోలీసు, న్యాయవ్యవస్థలు ఛాలెంజ్‌గా తీసుకొని జగన్ రెడ్డిపై ఉన్న కేసులను త్వరితగతిన విచారించాలని దేవినేని ఉమ కోరారు.

Devineni Uma: జగన్ ప్రతిపక్షానికి కూడా పనికిరాడు.. దేవినేని ఉమ సెటైర్లు
Devineni Uma Maheshwara Rao

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) మాజీ మంత్రి, తెలుగుదేశం సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు (Devineni Uma Maheshwara Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఐదేళ్లలో చేయని అభివృద్ధి.. కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు ఏడాదిలోనే చేసి చూపించారని ఉద్ఘాటించారు. ఐదేళ్లలో ఏమి చేశారో జగన్ ప్రజలకు చెబితే బాగుంటుందని చెప్పుకొచ్చారు. బెయిల్‌పై ఉన్న ముద్దాయి చట్టాలను కాపాడే వ్యవస్థలను బెదిరించేలా బరితెగింపు చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఇవాళ(సోమవారం) అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో దేవినేని ఉమ మీడియాతో మాట్లాడారు.


జగన్ తండ్రి హయాంలో పెట్టిన కేసులకు తాను ఈ రోజుకు వాయిదాలకు తిరుగుతున్నానని దేవినేని ఉమ గుర్తుచేశారు. పోలీసు, న్యాయవ్యవస్థలు ఛాలెంజ్‌గా తీసుకొని జగన్ రెడ్డిపై ఉన్న కేసులను త్వరితగతిన విచారించాలని కోరారు. అసెంబ్లీకి రాలేని పిరికి వ్యక్తి జగన్ రెడ్డి .. నీలాంటి వారు ప్రతిపక్షానికి కూడా పనికిరారని విమర్శించారు. ప్రజాస్వామ్యమన్నా, కోర్టులన్నా జగన్ రెడ్డికి లెక్క లేకుండా పోయిందని మండిపడ్డారు దేవినేని ఉమామహేశ్వరరావు.


జగన్ .. నీ వ్యూహాకర్తలు ఎవరూ, ఏం చేస్తున్నారని దేవినేని ఉమా మహేశ్వరరావు ప్రశ్నించారు. ఒక్క ఛాన్స్ అని ఏపీని జగన్ రెడ్డి చాలా నష్టపరిచారని.. మళ్లీ సింగయ్య శవంతో కుయుక్తులకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. మళ్లీ జగన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని వైసీపీ నేతలు ఏపీలో కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు వైసీపీనీ 11 సీట్లకు పరిమితం చేసినా.. ఫ్యాన్ పార్టీ నేతల బుద్ధి మారడం లేదని దుయ్యబట్టారు. ఏపీని ఏం చేద్దామనుకుంటున్నారు.. కుట్రలకు పాల్పడితే వైసీపీ నేతలను ప్రజలు తన్ని తరిమేస్తారని దేవినేని ఉమా మహేశ్వరరావు హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి

మామిడి కొనుగోలుపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

సిగాచి పరిశ్రమలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

Read latest AP News And Telugu News

Updated Date - Jul 07 , 2025 | 02:49 PM