Share News

Anitha On Ganja: ఏడాదిగా కృషి.. గంజాయిని నియంత్రించాం: హోంమంత్రి అనిత

ABN , Publish Date - Jul 14 , 2025 | 01:05 PM

Anitha On Ganja: గత ప్రభుత్వంలో స్కూలు బ్యాగుల్లోకి గంజా ప్యాకెట్‌లు వెళ్లిపోయాయని హోంమంత్రి విమర్శించారు. నాటి నుంచి నేటి వరకు కూడా ఒక యజ్ఞం తరహాలో గంజాయి నిర్మూలనకు పనిచేస్తున్నామని స్పష్టం చేశారు.

Anitha On Ganja: ఏడాదిగా కృషి.. గంజాయిని నియంత్రించాం: హోంమంత్రి అనిత
Anitha On Ganja

అమరావతి, జులై 14: గతంలో ఏపీ ఓ గంజాయి హబ్‌గా ఉండేదని హోంమంత్రి వంగలపూడి అనిత (Homer Minister Vangalapudi Anitha) అన్నారు. సోమవారం నాడు హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు ఏపీలో ఉన్నాయని చెప్పేవారని.. అయితే గత ఏడాది కాలంగా తాము చేసిన కృషి కారణంగా రాష్ట్రంలో గంజాయిని నియంత్రించగలిగామన్నారు. ఈగల్ అనే పేరును ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) స్వయంగా ప్రతిపాదించారని చెప్పుకొచ్చారు. ఈగల్ స్థాపించినప్పటి నుంచి రవికృష్ణను డైరెక్టర్‌గా చేసి వర్క్‌ను ప్రారంభించామన్నారు. వైజాగ్ , విజయవాడ, రాజమండ్రిలో మూడు ఈగల్ టీంలు పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. ఏజెన్సీ నుంచి వచ్చే రూట్లలో సీసీ కెమెరాలు, చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని.. ఈరోజుకు 831 గంజాయి కేసులు నమోదు చేశామని వెల్లడించారు.


గత ప్రభుత్వంలో స్కూలు బ్యాగుల్లోకి గంజా ప్యాకెట్‌లు వెళ్లిపోయాయని హోంమంత్రి విమర్శించారు. నాటి నుంచి నేటి వరకు కూడా ఒక యజ్ఞం తరహాలో గంజాయి నిర్మూలనకు పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. ఈగల్ టీంలు రోజుకు ఒక్కచోట అయినా క్లాస్‌లు ఏర్పాటు చేశారన్నారు. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ అని ఈగల్ టీం ప్రారంభించిందని చెప్పారు. క్వాట్పా యాక్టు ప్రకారం విద్యాసంస్థలకు సమీపంలో 100 మీటర్లు వరకు పొగాకు సంబంధిత వస్తువులు అమ్మకూడదని చెపుతున్నారన్నారు. మెడిసిన్‌లు, వైట్‌నర్, ఇంజక్షన్‌లు వాడుతున్నారని ఆపరేషన్ గరుడలో భాగంగామెడికల్ షాపులపై దాడులు చేశామన్నారు.


ప్రిస్క్రిప్షన్‌లు లేకుండా అమ్మకుండా చూడాలని మెడికల్ షాపు యజమానులకు చెప్పామని తెలిపారు. గంజాకంటే వేరే పంటలు పండిస్తే అంతకు మించి డబ్బులొస్తాయని చెప్పి 40 లక్షల ప్రత్యామ్నాయ మొక్కలను పంపిణీ చేశామని వెల్లడించారు. 20 వేల ఎకరాల్లో ఉండే గంజాయిని ఇప్పుడు 90 ఎకరాల్లో కూడా లేకుండా చేశామని... జీరో కల్టివేషన్‌కు తీసుకువచ్చామని చెప్పారు. సిల్వర్ ఓక్‌కు మూడు సంవత్సరాలు పడుతుందన్నారు. వాటి మధ్య ఇంటర్ క్రాప్‌లను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. 2024 నాటికి 68,620 కిలోలు గంజాయిని నాశనం చేశామని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

అధికారం కోసం ఏమైనా చేస్తారు.. జగన్‌పై యనమల ఫైర్

కృష్ణా జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌ భర్తపై కేసు నమోదు..కారణమిదే

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 14 , 2025 | 01:37 PM