Share News

AP News: ఏపీలో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

ABN , Publish Date - Jul 24 , 2025 | 10:12 PM

బందర్ రోడ్డులో గురువారం త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. బందర్ రోడ్డు సమీపంలో  నిర్మాణంలో ఉన్న షాపింగ్ మాల్ గడ్డర్లు కుప్పకూలాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఎవ్వరూ లేకపోవవడంతో పెను ప్రమాదం తప్పింది.

AP News: ఏపీలో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
Major Accident

విజయవాడ: బందర్ రోడ్డులో (Vijayawada Bandar Road) ఇవాళ (గురువారం జులై24) త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. బందర్ రోడ్డు సమీపంలో నిర్మాణంలో ఉన్న షాపింగ్ మాల్ గడ్డర్లు కుప్పకూలాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఎవ్వరూ లేకపోవవడంతో పెను ప్రమాదం తప్పింది. సమీపంలోని రోడ్డుపై భారీ ఐరన్ గడ్డర్లు పడిపోయాయి. కార్మికులు పని ముగించుకొని ఇళ్లకు వెళ్లిన సమయంలో ఐరన్ గడ్డర్లు కూలిపోయాయి. పక్కనే ఉన్న బిల్డింగ్స్‌, రోడ్డుపై గడ్డర్లు కుప్పకూలాయి.షెడ్ నిర్మాణం కోసం ఐరన్ గడ్డర్లతో ఫిల్లర్లు ఏర్పాటు చేశారు. రెండు ఫిల్లర్లతో‌ పాటు షెడ్ కుప్పకూలింది. ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మంత్రి నారా లోకేష్‌ను ఆలింగనం చేసుకున్న పవన్ కల్యాణ్

Hari Hara Veeramallu: సీఎం చంద్రబాబుకు హరిహర వీరమల్లు థ్యాంక్స్..

Read latest AP News And Telugu News

Updated Date - Jul 24 , 2025 | 10:15 PM