Kadapa Inter Student Killed: కడపలో దారుణం..
ABN , Publish Date - Jul 15 , 2025 | 10:32 AM
Kadapa Inter Student Killed: కడప జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్నేహితులతో కలిసి బయటకు వెళ్లిన ఇంటర్ విద్యార్థిని శవమై కనిపించింది.

కడప, జులై 15: జిల్లాలోని జమ్మలమడుగు (Jammalamadugu) పరిధిలో పర్యాటక కేంద్రమైన గండికోటలో ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. ప్రొద్దుటూరులోని ప్రైవేట్ జూనియర్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న వైష్ణవిగా గుర్తించారు. నిన్న (సోమవారం) స్నేహితులతో గండికోటకు వెళుతున్నానంటూ ఇంట్లో చెప్పి వెళ్లింది విద్యార్థిని. రాత్రి గడిచినప్పటికి విద్యార్థిని ఇంటిక రాకపోవడంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ప్రొద్దుటూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వైష్ణవి మిస్సింగ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈరోజు (మంగళవారం) ఉదయం గండికోటలోని ముళ్లపొదల్లో ఓ అమ్మాయి నగ్నంగా శవమై పడి ఉన్నట్లు స్థానికులు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించగా వైష్ణవిదిగా గుర్తించారు. ఆపై విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో తల్లిదండ్రులు హుటాహుటిన అక్కడకు చేరుకుని దారుణంగా హత్యకు గురైన కన్న బిడ్డను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విద్యార్థిని ఎర్రగుంట్ల మండలం హనుమాన్ దుర్తి గ్రామానికి చెందిన వాసి. విద్యార్థిని ఐదు సంవత్సరాలుగా అదే గ్రామానికి చెందిన లోకేష్ అనే యువకుడితో ప్రేమవ్యవహారం ఉన్నట్లు సమాచారం. యువకుడు లోకేష్‌తో నిన్న బైక్‌పై వైష్ణవి గండికోటకు వెళ్ళినట్లు సీసీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. జమ్మలమడుగు పోలీసు అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. విద్యార్థిని హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
వాకింగ్ చేస్తున్న నేతపై కాల్పులు.. హైదరాబాద్‌లో దారుణం
మరికొన్ని గంటల్లో ఉరి.. అద్భుతం జరుగుతుందా?..
Read latest AP News And Telugu News