AP Education: ర్యాంకర్లను సన్మానించిన మంత్రి లోకేశ్
ABN , Publish Date - Jul 15 , 2025 | 06:56 AM
నీట్ యూజీ ఫలితాల్లో ఓపెన్ కేటగిరీలో 19వ ర్యాంకు సాధించిన రాజమండ్రికి చెందిన విద్యార్థి డి.కార్తీక్‌రామ్ కిరీటిని మంత్రి నారా లోకేశ్ అభినందించారు.

ఇంటర్నెట్ డెస్క్: నీట్ యూజీ ఫలితాల్లో ఓపెన్ కేటగిరీలో 19వ ర్యాంకు సాధించిన రాజమండ్రికి చెందిన విద్యార్థి డి.కార్తీక్‌రామ్ కిరీటిని మంత్రి నారా లోకేశ్ అభినందించారు. కార్తీక్‌రామ్‌తోపాటు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మెరుగైన ర్యాంకులు సాధించిన కోటిపల్లి యశ్వంత్ సాత్విక్, కంచుమర్తి ప్రణీత్ సోమవారం ఉండవల్లిలోని నివాసంలో మంత్రిని కలిశారు. కాగా, నాగార్జున వర్సిటీ పరిధిలోని పలు కాలేజీల్లో చదివిన విద్యార్థులకు డిగ్రీ సర్టిఫికెట్లు జారీ కానందున ఐసెట్ కౌన్సెలింగ్ గడువును మరో వారం రోజులు పెంచాలని ఏపీ ప్రైవేటు డిగ్రీ కాలేజీల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. సర్టిఫికెట్లు రాకపోవడంతో చాలామంది విద్యార్థులు ఐసెట్‌లో రిజిస్ర్టేషన్ చేసుకోలేకపోయారని తెలిపింది. త్వరలో సర్టిఫికెట్లు జారీచేసే అవకాశం ఉన్నందున కౌన్సెలింగ్ గడువు పొడిగించాలని కోరింది.