Raghurama: కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం.. రఘురామ ఫైర్
ABN , Publish Date - Apr 18 , 2025 | 03:01 PM
Raghurama Krishnam Raju: కూటమి ప్రభుత్వంపై కొన్ని పత్రికలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి కృషి చేస్తోందని రఘురామ అన్నారు.

గుంటూరు జిల్లా: కూటమి ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తున్నామని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కె.రఘురామకృష్ణరాజు అన్నారు. ఇవాళ(శుక్రవారం) రతన టాటా విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రఘురామ పాల్గొని మాట్లాడారు. రతన్ టాటా కేవలం పారిశ్రామికవేత్త మాత్రమే కాదు గొప్ప మానవతావాదని అభివర్ణించారు. విద్య, వైద్య రంగాల్లో ఆయన చేసిన సేవలు నిరుపమానమని ప్రశంసించారు. రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలని అందరి కోరిక అని రఘురామకృష్ణరాజు చెప్పారు.
ఈ విషయంపై తాను నాలుగేళ్ల క్రితమే ప్రధానికి లేఖ రాశానని రఘురామకృష్ణరాజు చెప్పారు. అవార్డు ఇచ్చినా, లేకున్నా ఆయన భారతీయుల హృదయాల్లో రత్నమేనని కొనియాడారు. టీడీపీ నేత కోడెల శివప్రసాదరావుతో తనకు సన్నిహిత సంబంధం ఉందని చెప్పారు. టీడీపీ హయాంలో మాజీ స్పీకర్ కోడెలపై వైసీపీ నాయకుల చిల్లర మాటలను తాను వ్యతిరేకించానని గుర్తుచేశారు. ఇలా తాను వ్యతిరేకించటంతో జగన్ తనను దూరం పెట్టారని అన్నారు. కూటమి ప్రభుత్వంపై కొన్ని పత్రికలు దుష్ప్రచారం చేస్తున్నాయని రఘురామకృష్ణరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
Jagan Big Shock: జగన్‌కు భారీ ఎదురు దెబ్బ
Police Case: భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు
Cool Drink Incident: అసలేం తినేటట్టు లేదు.. తాగేట్టూ లేదుగా
Read Latest AP News And Telugu News