Senior Citizen Cards: కదల్లేని వారికి కార్డులెలా?
ABN , Publish Date - Apr 28 , 2025 | 11:29 AM
Senior Citizen Cards: సీనియర్ సిటిజన్ కార్డుల కోసం వృద్ధులు తిప్పలు పడుతున్నారు. సచివాలయానికి వెళ్లి అక్కడ దరఖాస్తు చేసుకోవాలంటే చాలా ఇబ్బంది కరంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వృద్ధులకు సీనియర్
సిటిజన్ కార్డుల కష్టాలు
సచివాలయాలకు వెళ్తేనే
ప్రాసెసింగ్ చేస్తున్న సిబ్బంది
ఇంటి వద్దనే కార్డు మంజూరు చేయాలంటున్న వృద్ధులు
గుంటూరు, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభు త్వం మంజూరు చేస్తున్న సీనియర్ సిటిజన్ కార్డులను పొందలేని పరిస్థితి పలువురు వృద్ధుల్లో నెలకొన్నది. కార్డు కోసం సచివాలయాలకు వెళ్లాల్సి రావడమే ఇందుకు కారణం. వృద్ధుల్లో కొందరు అనారోగ్య సమస్యల దృష్ట్యా నడవలేని వాళ్లు ఉన్నారు. వారు కార్డు కోసం సచివాలయానికి వెళ్లి అక్కడ దరఖాస్తు చేసుకోవాలంటే చాలా ఇబ్బంది కరంగా మారింది. అసలే ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం 10 గంటల సమయం దాటిన తర్వా త వృద్ధులు ఇంటి నుంచి అడుగు బయటకు పెట్టలేని పరిస్థితి. ఒకవేళ ఎక్కడికైనా బయట కు వెళ్లి వస్తే వడదెబ్బ బారిన పడుతు న్నారు. గుంటూరు జిల్లాలో 85 ఏళ్ల వయస్సు పైబడి వృద్ధులు దాదాపుగా 17 వేల మంది ఉన్నారు. ఇక బాపట్ల, పల్నాడు జిల్లాల పరిధిలోనూ వేల సంఖ్యలో వృద్ధులు ఉన్నారు. గ్రామాలు, కొన్ని పట్టణాల్లో సుదూరంగా సచివాలయాలు ఉన్నా యి.
అక్కడ వరకు ఎండల్లో వెళ్లలేక.. కార్డులు పొందలేక వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని సచివాలయాల్లో ఉదయం 11 గంటల వరకు సిబ్బంది రావడంలేదు.. ఆ తర్వాత కూడా రకరకాల పనులు, ఫోన్లలో బిజీగా ఉం టున్నారు. ఈ పరిస్థితుల్లో వృద్ధులు ఎండలో అంతదూరం వెళ్లలేక.. వెళ్లినా గంటల తరబడి నిరీక్షంచలేక పోతున్నారు.ఈ పరిస్థితుల్లో సచి వాలయాలకు వెళ్లి సీనియర్ సిటిజన్ కార్డులు పొందాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ/వార్డు సచివాలయాల్లో సీనియర్ సిటి జన్ కార్డులను సిబ్బంది మంజూరు చేస్తున్నా రు. ఎవరైతే 60 ఏళ్ల వయస్సు దాటిన వృద్ధులు ఆధార్ జిరాక్స్, పాసుపోర్టు సైజు ఫొటో, బ్లడ్ గ్రూపు, ఆధార్ లింక్ మొబైల్ నంబరు తీసు కుని వచ్చిన వారికి దరఖాస్తు ఇచ్చి దానిని పూర్తి చేయించి సచివాలయాల సిబ్బంది ప్రాసె సింగ్ చేస్తున్నారు. దాంతో ఆన్‌లైన్‌లో ప్రభుత్వ లోగోతో సీనియర్ సిటిజన్ కార్డు మంజూరు అవుతున్నది. ఆ కార్డులో వృద్ధుడు/వృద్ధురాలి పేరు, పుట్టిన తేదీ, మాస్క్‌డ్ ఆధార్ నంబరు, సీనియర్ సిటిజన్ కార్డు నంబరు, బార్ కోడ్, చిరునామా, కాంటాక్టు నంబరు, అత్యవసరమైతే సంప్రదించాల్సిన వ్యక్తి పేరు, మొబైలు నం బరు, ఎమర్జన్సీ నంబర్లు పొందుపరిచి ఉంటున్నాయి. ఈ సీనియర్ సిటిజన్ కార్డులు పలు విధాలుగా వృద్ధులకు ఉపయోగపడతా యని అధికారులు చెబుతున్నారు.
కార్డుతో పలు ప్రయోజనాలు..
సీనియర్ సిటిజన్ కార్డులతో బహుళ ప్రయోజనాలున్నాయి. వృద్ధాప్య పింఛన్ పొందాలంటే ఈ కార్డు ఉంటే సరిపోతుంది. ఇందుకు కారణంగా ఈ కార్డులోనే పుట్టిన తేదీ నమోదై ఉంటుంది. అలానే ఆధార్ నంబరు కూడా ఉంటుంది. మిగతా ప్రభుత్వ పథకాలకు లబ్ధి పొందాలన్నా ఉపయోగ కరంగా ఉంటుంది. ఆర్టీసీ బస్సు ప్రయాణా ల్లో సీనియర్ సిటిజన్ కార్డు చూపించి టిక్కెట్ చార్జీలో రాయితీ పొందవచ్చు. బ్యాంకుల్లో వృద్ధులకు ప్రత్యేకించి అధిక వడ్డీ చెల్లించే డిపాజిట్ల స్కీమ్‌లకి కూడా ఈ కార్డు ఉపయోగపడుతుంది. ఆస్పత్రుల్లోనూ సీనియర్ సిటిజన్ కార్డు ఉపయోగపడు తుంది. రైల్వే టిక్కెట్ కౌంటర్లలో త్వరితగతిన టిక్కెట్లు బుకింగ్ చేసుకోవచ్చు. ఈ ఉప యోగాల దృష్ట్యా సీనియర్ సిటిజన్ కార్డుకు డిమాండ్ పెరుగుతుంది. ఈ పరిస్థితుల్లో ఇళ్ల వద్దనే పింఛన్‌ను పంపిణీ చేస్తున్నట్లుగా సీనియర్ సిటిజన్ కార్డులు పంపిణీ చేయాలని వృద్ధులు కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హరిరామ్ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్న ఏసీబీ అధికారులు...
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి
మీ ఇంట్లో ఏపీ ఉందా.. అయితే ఈ జాగ్రర్తలు పాటించండి..
For More AP News and Telugu News