Share News

Pawan Kalyan: పురందేశ్వరికి బర్త్ డే విషెస్ తెలిపిన పవన్

ABN , Publish Date - Apr 22 , 2025 | 12:58 PM

Pawan Kalyan wishes on Purandeswari: బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పుట్టిన రోజును పురస్కరించుకుని పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పురందేశ్వరికి బర్త్ డే విషెస్ తెలిపారు.

Pawan Kalyan: పురందేశ్వరికి బర్త్ డే విషెస్ తెలిపిన పవన్
Pawan Kalyan wishes on Purandeswari

అమరావతి: బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి జన్మదినం సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పురందేశ్వరికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. లోక్‌సభలో బలంగా తన గళాన్ని పురందేశ్వరి వినిపిస్తారని అన్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం పురంధేశ్వరికి ఉందని తెలిపారు. ప్రజాపక్షం వహిస్తూ, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచనలు చేస్తుంటారని అన్నారు. పురంధేశ్వరికి సంపూర్ణ ఆయురారోగ్యాలు, ఆనందాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని పవన్ కల్యాణ్ తెలిపారు.


ప్రజాసంక్షేమానికి పురందేశ్వరి కృషి:మంత్రి సత్యకుమార్ యాదవ్

Minister-Satyakumar.jpg

బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరికి ఏపీ వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తండ్రి బాటలో ప్రజాసంక్షేమానికి కృషి చేస్తున్న నాయకురాలు పురందేశ్వరి అని కొనియాడారు. వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర నిర్మాణంలో తెలుగింటి మహిళల భాగస్వామ్యానికి ఆమె ప్రతీకగా నిలవాలని ఆకాంక్షిస్తున్నానని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

YSRCP Leaders: దూకుడు పెంచిన కూటమి సర్కార్.. వైసీపీ నేతల్లో టెన్షన్ టెన్షన్

IPS officer Anjaneyulu: కాదంబరి జత్వాని కేసులో మరో ఐపీఎస్ అరెస్ట్

AP NEWS: ఎలమంచిలి మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానంపై ఉత్కంఠ

High Court: చట్టానికి లోబడే దర్యాప్తు జరగాలి

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 22 , 2025 | 01:07 PM