Pawan Kalyan: జనసేన కమిటీలపై పవన్ కల్యాణ్ ఫోకస్
ABN , Publish Date - Nov 22 , 2025 | 02:04 PM
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ నిర్మాణంపై ఫుల్ ఫోకస్ పెట్టారు. జనసేన కమిటీల నిర్మాణం, కూర్పుపై కసరత్తు చేస్తున్నారు.
అమరావతి, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పార్టీ నిర్మాణంపై ఫుల్ ఫోకస్ పెట్టారు. జనసేన కమిటీల నిర్మాణం, కూర్పుపై కసరత్తు చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం, కార్యక్రమాల నిర్వహణపై కార్యకర్తల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. పార్టీ కమిటీల నిర్మాణం, వాటి కూర్పుపై పార్టీ ముఖ్యులకు దిశానిర్దేశం చేశారు పవన్ కల్యాణ్.
పార్టీ కార్యక్రమాల నిర్వహణ, కార్యకర్తల మనోభావాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని పవన్ సూచించారు. ముఖ్యంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో బలమైన నేతలు ఉన్నారని పార్టీ హై కమాండ్ భావిస్తోంది. అక్కడ నాయకత్వాన్ని మరింత పటిష్టం చేసి, పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం నిర్ణయించారు. అధినేత ఇప్పటికే ఇచ్చిన ఆదేశాలను అనుసరించి వివిధ నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు, వీర మహిళలతో చర్చిస్తోంది పార్టీ కేంద్ర కార్యాలయ బృందం. మరోవైపు పార్టీ శ్రేణులు అందిస్తున్న సూచనలను నమోదు చేస్తున్నారు జనసేన హై కమాండ్.
ఇవి కూడా చదవండి...
మావోయిస్టులకు బిగ్ షాక్.. భారీగా లొంగుబాటు
ఐబొమ్మ రవి కేసు.. వెలుగులోకి కీలక అంశాలు
Read Latest AP News And Telugu News