Share News

Kandula Durgesh: జగన్ పాలనలో వైఫల్యాలు.. మంత్రి కందుల దుర్గేష్ హాట్ కామెంట్స్

ABN , Publish Date - Jan 28 , 2025 | 05:36 PM

Kandula Durgesh: గుంటూరు అభివృద్ధిపై కీలక నిర్ణయాలుప్రభుత్వ పథకాలు పగడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు చేపడతామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నగరంలో నెలకొన్న సమస్యలను త్వరగా పరిష్కరించేలా చర్యలు చేపడతామని అన్నారు.

Kandula Durgesh: జగన్ పాలనలో వైఫల్యాలు.. మంత్రి కందుల దుర్గేష్ హాట్ కామెంట్స్
Minister Kandula Durgesh

గుంటూరు జిల్లా : జగన్ పాలనలోని వైఫల్యాల నుంచి ఏపీ కోలుకునేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. గుంటూరు జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించామని అన్నారు. ఇవాళ(మంగళవారం) గుంటూరు జిల్లా అభివృద్ధిపై మంత్రి కందుల దుర్గేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మీడియాతో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు.


క్షేత్రస్థాయిలో జరగాల్సిన అంశాలపై జలవనరులు, వ్యవసాయం, నగర అభివృద్ధిపై సమీక్ష చేశామని చెప్పారు. ప్రభుత్వ పథకాలు పగడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. రాజధాని జిల్లాలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఉండటం జిల్లా అభివృద్ధికి మేలు జరుగుతుందని తెలిపారు. రైతుకు సంపూర్ణ సహకారం అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ప్రభుత్వంలో మూడు ప్రధాన పార్టీలు కలిసి సమష్టిగా పనిచేస్తున్నాయని చెప్పారు. కౌలు రైతులకు కావాల్సిన రుణసదుపాయలపై బ్యాంకర్లతో మాట్లాడామని అన్నారు. ప్రభుత్వంలో మూడు ప్రధాన పార్టీలు కలిసి సమష్టిగా పనిచేస్తున్నాయన్నారు. గుంటూరు నగర అభివృద్ధిపై కూడా కొన్ని సమస్యలు చర్చకు వచ్చాయని.. వాటిపై కూడా దృష్టి పెట్టి త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

YS Sharmila: అప్పుడు కనబడలేదా ఆర్థిక భారం.. షర్మిల ఫైర్

Tirumala: తిరుమలకు ఇస్రో ఛైర్మన్.. గగన్‌యాన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు..

Nara Lokesh: ఉద్యోగుల కాళ్ల దగ్గర మంత్రి నేమ్ ప్లేట్

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 28 , 2025 | 05:37 PM