Share News

Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణకు అభినందనల వెల్లువ

ABN , Publish Date - Jan 25 , 2025 | 10:18 PM

Nandamuri Balakrishna: గణతంత్ర దినోత్సవ సంబురాల వేళ కేంద్ర ప్రభుత్వం శనివారం నాడు పద్మ పురస్కారాలు ప్రకటించింది. పలు రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు కేంద్ర సర్కార్ ఎంపిక చేసింది. ఈ సందర్భంగా పద్మభూషణ్ అవార్డు పొందిన హీరో నందమూరి బాలకృష్ణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు.

Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణకు అభినందనల వెల్లువ

అమరావతి: గణతంత్ర దినోత్సవ సంబురాల వేళ కేంద్ర ప్రభుత్వం శనివారం నాడు పద్మ పురస్కారాలు ప్రకటించింది. పలు రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు కేంద్ర సర్కార్ ఎంపిక చేసింది. ఈ సందర్భంగా పద్మభూషణ్ అవార్డు పొందిన హీరో నందమూరి బాలకృష్ణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్ వారసత్వాన్ని కొనసాగించారని ప్రశంసించారు. సినిమా, రాజకీయ, సేవా రంగాల్లో బాలయ్య అంకితభావం, ప్రజాసంక్షేమాన్ని కాంక్షించి పని చేశారని ఉద్ఘాటించారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా చేసిన సేవలు కూడా వెలకట్టలేనివని చంద్రబాబు ప్రశంసించారు. పద్మభూషణ్ అవార్డుకు బాలకృష్ణ పూర్తిగా అర్హుడని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


నాగేశ్వర్ రెడ్డికి సీఎం చంద్రబాబు అభినందనలు

CM-Chandrababu.jpg

ఏఐజి హాస్పిటల్ చైర్మన్, ఫౌండర్, ప్రసిద్ధ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్ ప్రకటించడం పట్ల సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఔషధ రంగంలో ఆయన చేసిన సేవలు దేశానికే గర్వకారణమని చెప్పారు. తెలుగువారికి ఈ రంగంలో మీరు చేస్తున్న సేవలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నానని సీఎం చంద్రబాబు అన్నారు.


పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ అభినందనలు

AP-Governor-Abdul-Nazir.jpg

పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించిన సందర్భంగా నందమూరి బాలకృష్ణకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ అభినందించారు. ఏపీకి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీతలను గవర్నర్ అభినందించారు సాహిత్యం, విద్య విభాగంలో కేఎల్ కృష్ణ, కళా విభాగంలో మాడుగుల నాగఫణి శర్మ, వాదిరాజ్ రాఘవేంద్రాచార్య పంచముఖి విభాగంలో.. సాహిత్యం, విద్య మరియు కళ విభాగంలో మిరియాల అప్పారావు (మరణానంతరం) కుటుంబ సభ్యులు. అవార్డు గ్రహీతలు రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు.


సినీ రంగంలో చేసిన అద్భుతమైన కృషికి గుర్తింపుగా పద్మభూషణ్: మంత్రి అచ్చెన్నాయుడు

atchennaidu.jpg

ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించిన సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. "నందమూరి బాలకృష్ణ సినీ రంగంలో చేసిన అద్భుతమైన కృషి, ప్రజాసేవలో చూపిన నిబద్ధతకు గుర్తింపుగా ఈ అత్యున్నత సత్కారం లభించడం చాలా గర్వకారణం. ఆయనకు ఈ గౌరవం దక్కడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణం," అని మంత్రి అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంలో బాలకృష్ణ భవిష్యత్తు మరింత విజయవంతం కావాలని, ఆయన మరిన్ని పురస్కారాలు అందుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆకాంక్షించారు.


ప్రజాసేవలో చూపిన నిబద్ధతకు గుర్తింపుగా పద్మభూషణ్: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

MInister-Anam-Ram-narayana-.jpg

పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించిన సందర్భంగా నందమూరి బాలకృష్ణకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘నందమూరి బాలకృష్ణ సినీ రంగంలో చేసిన అద్భుతమైన కృషి, ప్రజాసేవలో చూపిన నిబద్ధతకు గుర్తింపుగా ఈ అత్యున్నత సత్కారం లభించడం చాలా గర్వకారణం. ఆయనకు ఈ గౌరవం దక్కడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణం’’ అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.


కళల పట్ల బాలకృష్ణకు ఉన్న మక్కువతోనే పద్మభూషణ్: మంత్రి కొల్లు రవీంద్ర

kollu-ravindra.jpg

సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ ప్రకటనపై రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హర్షం వ్యక్తం చేశారు. కళల విభాగంలో బాలకృష్ణకు పద్మభూషణ్ ప్రకటించడం సంతోషంగా ఉందని . కళల పట్ల బాలకృష్ణకు ఉన్న మక్కువ, సంస్కృతి పట్ల ఉన్న ప్రేమే పద్మ అవార్డు వరకు తీసుకొచ్చిందని అన్నారు. ఇలాంటి మరెన్నో పురస్కారాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.

Updated Date - Jan 25 , 2025 | 10:36 PM