Kommareddy Pattabhi Ram: డ్వాక్రా మహిళలకు ఆర్థిక చేయూత కల్పిస్తాం
ABN , Publish Date - Jan 25 , 2025 | 06:33 PM
Kommareddy Pattabhi Ram: డంపింగ్ యార్డ్ ఫ్రీ స్టేట్‌గా ఆంధ్రప్రదేశ్‌ని చేయాలనేది మా ప్రధాన కర్తవ్యమని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. తడి చెత్తని వర్నీ కంపోస్టు కింద మార్చి మార్క్ ఫెడ్ ద్వారా రైతులకు అందజేస్తామని తెలిపారు. పొడి చెత్తలో రీ యూజబుల్స్ అయిన ప్లాస్టిక్ , పేపర్ వేరు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించే ఏర్పాటు చేస్తామని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు.

ఏలూరు జిల్లా: ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో స్వచ్ఛ ఆంధ్రా రివ్యూ మీటింగ్ ఇవాళ (శనివారం) జరిగింది. ఈ సమావేశంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, స్థానిక ఎమ్మెల్యే బడేటి రాధా కృష్ణయ్య, మేయర్ షేక్ నూర్జహాన్, కమిషనర్ కే. భాను ప్రతాప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ... ప్రతి రోజూ ఏలూరు నుంచి 103 మెట్రిక్ టన్నుల చెత్త వస్తుందని అన్నారు. గత పాలకులు ఏలూరులో 60 వేల మెట్రిక్ టన్నుల చెత్త వదిలేసి వెళ్లారని చెప్పారు.
ఏపీవ్యాప్తంగా 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త అలానే ఉందన్నారు. అక్టోబర్ 2వ తేదీ లోపు రాష్ట్రంలో ఉన్న చెత్త అంతా క్లియర్ చేస్తామన్నారు. ఏలూరులో ఉన్న 30 ఎకరాల డంపింగ్ యార్డ్‌లో చెత్త అంతా క్లియర్ చేసి ప్రజా అవసరాల కోసం ఉపయోగిస్తామని వివరించారు. డంపింగ్ యార్డ్ ఫ్రీ స్టేట్‌గా ఆంధ్రప్రదేశ్‌ని చేయాలనేది మా ప్రధాన కర్తవ్యమన్నారు. తడి చెత్తని వర్నీ కంపోస్టు కింద మార్చి మార్క్ ఫెడ్ ద్వారా రైతులకు అందజేస్తామని తెలిపారు. పొడి చెత్తలో రీ యూజబుల్స్ అయిన ప్లాస్టిక్ , పేపర్ వేరు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించే ఏర్పాటు చేస్తామన్నారు. డ్వాక్రా మహిళలను కూడా ఇందులో భాగస్వాములను చేసి వారికి ఆర్థిక చేయూత అందేలా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రతి కార్పొరేషన్ పరిధిలో మినీ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
విజయసాయి రాజకీయ సన్యాసంపై చంద్రబాబు ఏమన్నారంటే
వివేకానందరెడ్డికి గుండెపోటని ఎందుకు చెప్పానంటే
కూటమి కోసం రాజీనామా.. అసలు విషయం బయటపెట్టిన..
For More Andhra Pradesh News and Telugu News..