Home Minister Anitha: తప్పు చేస్తే చట్టప్రకారం చర్యలు.. హోం మంత్రి అనిత వార్నింగ్
ABN , Publish Date - Apr 22 , 2025 | 02:52 PM
Home Minister Anitha: వైసీపీ అధినేత వెఎస్ జగన్‌పై హోం మంత్రి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ నాలుగు గోడల మధ్య కాకుండా ప్రజల్లోకి వచ్చి అక్రమ కేసులు లాంటి మాటలు మాట్లాడితే ప్రజలే సరైన సమాధానం చెబుతారని హోం మంత్రి అనిత హెచ్చరించారు.

అమరావతి: తప్పు చేసిన వారికి శిక్షపడాలనే నినాదంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. తమ ప్రభుత్వంలో సాక్ష్యాలు లేకుండా పోలీసులు ఏ కేసులోనూ ముందుకు వెళ్లట్లేదని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారిని పారదర్శకంగానే శిక్షిస్తున్నామని అన్నారు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల్లో ఎంత ఆవేశం ఉన్నా.. గత జగన్ ప్రభుత్వంలో తప్పు చేసిన వారి పట్ల ఓ పద్ధతి ప్రకారం చట్టపరంగానే చర్యలు తీసుకుంటున్నామని హోం మంత్రి అనిత చెప్పారు.
వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులే ఎందుకు అరెస్టు అవుతున్నారో ఆ పార్టీ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలని హోంమంత్రి వంగలపూడి అనిత హితవు పలికారు. జగన్ వల్ల గతంలో శ్రీలక్ష్మీ లాంటి అధికారులు కూడా జైలుకు వెళ్లారని చెప్పారు. తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నా ఏనాడూ టీడీపీ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు ఇబ్బంది పడలేదని అన్నారు. అక్రమ కేసులతో నాయకులు బలయ్యారే కానీ తమ వల్ల అధికారుల అరెస్టు జరగలేదని తేల్చిచెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం తప్పుచేయలేదనటానికి ఇదే నిదర్శనమని అన్నారు. జగన్ నాలుగు గోడల మధ్య కాకుండా ప్రజల్లోకి వచ్చి అక్రమ కేసులు లాంటి మాటలు మాట్లాడితే ప్రజలే సరైన సమాధానం చెబుతారని హెచ్చరించారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రుల విజ్ఞాపన మేరకే డోర్ డెలివరీ హత్య కేసులో పునర్ విచారణ జరుగుతోందని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌తో శభాష్ అనిపించుకోవటానికి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించిన అధికారులు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఇలాంటి వారంతా న్యాయస్థానాన్ని ఎదుర్కోవాల్సిందేనని ఏపీ హోంమంత్రి అనిత వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి
YSRCP Leaders: దూకుడు పెంచిన కూటమి సర్కార్.. వైసీపీ నేతల్లో టెన్షన్ టెన్షన్
IPS officer Anjaneyulu: కాదంబరి జత్వాని కేసులో మరో ఐపీఎస్ అరెస్ట్
AP NEWS: ఎలమంచిలి మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానంపై ఉత్కంఠ
High Court: చట్టానికి లోబడే దర్యాప్తు జరగాలి
For More Andhra Pradesh News and Telugu News..