Share News

Road Accident: ఘోర ప్రమాదం.. లారీ, ఆటో ఢీకొని బాబోయ్..

ABN , Publish Date - Jul 21 , 2025 | 09:00 PM

రోడ్డు ప్రమాదంలో బత్తుల బ్రహ్మయ్య, నాగమూర్తమ్మ, రమణ, ముత్యాలమ్మ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం బాధిత కుటుంబసభ్యులు, బంధువులకు సమాచారం అందించారు.

Road Accident: ఘోర ప్రమాదం.. లారీ, ఆటో ఢీకొని బాబోయ్..
Road Accident

పల్నాడు: జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం(Road Accident) చోటు చేసుకుంది. శావల్యాపురం (Savalyapuram) మండలం కనుమర్లపూడి (Kanumarlapudi) వద్ద లారీ, ఆటో ఢీకొని నలుగురు మృతిచెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు సిబ్బందితో సహా హుటాహుటిన అక్కడికి చేరుకున్న సీఐ ప్రభాకర్ సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, మృతులంతా కారుమంచి వాసులుగా గుర్తించారు పోలీసులు.


ఈ ప్రమాదంలో బత్తుల బ్రహ్మయ్య, నాగమూర్తమ్మ, రమణ, ముత్యాలమ్మ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం బాధిత కుటుంబసభ్యులు, బంధువులకు సమాచారం అందించారు. ప్రమాదం గురించిన తెలుసుకున్న ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. బాధితులను కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి

అజ్ఞాతంలోకి పేర్ని నాని.. గాలిస్తున్న పోలీసులు..

విచారణకు హాజరు కాలేను: మాజీ మంత్రి నారాయణ స్వామి

For More Andhra Pradesh News

Updated Date - Jul 21 , 2025 | 09:13 PM