Wife Hides Husbands Body: దృశ్యం తరహా స్కెచ్.. భర్తను చంపేసి మృతదేహాన్ని ఏం చేసిందంటే..
ABN , Publish Date - Jul 21 , 2025 | 08:26 PM
భర్తతో కలిసి హనీమూన్‌కు వెళ్లి అక్కడే అతడిని చంపించిన ఘటన నెల రోజుల క్రితం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అలాగే ఢిల్లీలో ఓ మహిళ తన భర్తకు కరెంట్ షాక్ కొట్టించి చంపేసింది. తాజాగా ముంబైలోనూ అదే తరహా ఘటన చోటు చేసుకుంది.

వివాహేతర సంబంధాలు, ఇష్టం లేని పెళ్లిళ్లు వంటి కారణాలతో భర్తలను చంపేస్తున్న భార్యల సంఖ్య ఇటీవలి కాలంలో విపరీతంగా పెరుగుతోంది (Wife Kills Husband). భర్తతో కలిసి హనీమూన్‌కు వెళ్లి అక్కడే అతడిని చంపించిన ఘటన నెల రోజుల క్రితం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అలాగే ఢిల్లీ (Delhi)లో ఓ మహిళ తన భర్తకు కరెంట్ షాక్ కొట్టించి చంపేసింది. తాజాగా ముంబైలోనూ అదే తరహా ఘటన చోటు చేసుకుంది.
ముంబైకి సమీపంలో ఉన్న ఓ గ్రామానికి చెందిన విజయ్ చవాన్ (35) అనే వ్యక్తి గత 15 రోజులుగా కనిపించడం లేదు. అతడు తన భార్య కోమల్‌తో కలిసి నివసిస్తున్నాడు. అయితే 15 రోజులుగా విజయ్ కనిపించకపోవడంతో అతడి సోదరుడు పలు చోట్ల వెతుకుతూ కోమల్ ఉంటున్న ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే కోమల్ అక్కడి నుంచి మాయమైంది. ఆ ఇంటిలో ఓ చోట టైల్స్ రంగు విభిన్నంగా కనిపించడంతో విజయ్ సోదరుడికి అనుమానం మొదలైంది. ఆ టైల్స్‌ను తొలగించి చూడగా విజయ్ మృతదేహం కుళ్లిన స్థితిలో కనిపించింది.
విజయ్ సోదరుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్ట్‌మ్‌కు తరలించారు. కోమల్ కొంత కాలంగా పక్కింట్లో ఉంటున్న మోనూ అనే యువకుడితో ప్రేమాయణం సాగిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. వారిద్దరూ కలిసి విజయ్‌ను చంపేసి ఎక్కడికో పారిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరి కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఆ పిల్లి ప్రమాదాన్ని ఎలా పసిగట్టిందో చూడండి.. యజమానిని కాపాడి..
మీ చూపు షార్ప్ అయితే.. ఈ గడ్డిలో పాము ఎక్కడుందో 7 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..