Share News

Buddha Venkanna: అరాచక శక్తులను అణచివేస్తాం..పెద్దిరెడ్డికి బుద్దావెంకన్న స్ట్రాంగ్ వార్నింగ్

ABN , Publish Date - Mar 19 , 2025 | 11:22 AM

Buddha Venkanna: గత జగన్ ప్రభుత్వంలో వేల‌కోట్ల రూపాయల మద్యం కుంభకోణం చేశారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న ఆరోపించారు. నేషనల్ క్రైం రికార్డు ప్రకారం వైసీపీ హయాంలో మద్యం ద్వారా వందశాతం మరణాలు సంభవించాయని రిపోర్డు ఇచ్చిందని బుద్దా వెంకన్న గుర్తుచేశారు.

Buddha Venkanna: అరాచక శక్తులను అణచివేస్తాం..పెద్దిరెడ్డికి బుద్దావెంకన్న స్ట్రాంగ్ వార్నింగ్
Buddha Venkanna

విజయవాడ: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అని గతంలో ఉండేదని.. కానీ జగన్ జమానాలో మద్యం తాగితే ప్రాణాలు కోల్పోయేలా చేశారని విమర్శలు చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిలు కొత్త స్కాం చేశారని ఆరోపణలు చేశారు. మద్యం అడ్డు పెట్టుకుని వైసీపీ నేతలు వేలమంది ప్రాణాలు తీశారని విమర్శించారు. ఈ అమ్మకాల ద్వారా వచ్చిన సొమ్మును వాటాలుగా ముగ్గురూ పంచుకున్నారని ఆరోపించారు. ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేశారని అన్నారు. చిత్రగుప్తడు కూడా రాయలేని అన్ని‌పాపాలను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి చేశారని మండిపడ్డారు. మద్యం, మైనింగ్‌లో భారీగా దోచుకున్నారని ఆరోపించారు. ఈ డబ్బుతోనే కుప్పంలో చంద్రబాబును గెలవనివ్వమని రంకెలు వేశారని ధ్వజమెత్తారు. మీ‌పాపపు సొమ్ము వద్దని కుప్పం ప్రజలు చంద్రబాబుకే పట్టం కట్టారని అన్నారు. పుంగనూరులో చంద్రబాబును అడ్డుకుని దాడి చేయించారని మండిపడ్డారు. నేషనల్ క్రైం రికార్డు ప్రకారం ఏపీలో 2019-24 మధ్య మద్యం ద్వారా వందశాతం మరణాలు సంభవించాయని రిపోర్డు ఇచ్చిందని అన్నారు. ఈ పాపం పెద్దిరెడ్డి కుటుంబానిది కాదా అని ప్రశ్నించారు. ఇన్ని ప్రాణాలు తీసి మధ్యంతర బెయిల్ కోసం‌ కోర్టుకు వెళ్లారని చెప్పారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చేయని స్కాం లేదు, చేయని కబ్జా లేదన్నారు. కోర్టులో ప్రభుత్వ న్యాయవాదులు గట్టిగా వాదనలు వినిపించి బెయిల్ రాకుండా చూడాలని బుద్దా వెంకన్నకోరారు.


అరాచక శక్తులను అణచివేస్తాం..

‘చంద్రబాబు మీలాగా దౌర్జన్యాలు చేయిస్తే... మీరు అసలు రోడ్ల మీదకు వచ్చేవారా. అరాచక శక్తులను చంద్రబాబు అణచి వేస్తారు.. మీలాగా దాడులు చేయించరు. పుంగనూరులో మా టీడీపీ కార్యకర్తను చంపించారు... చంద్రబాబు, లోకేష్ మిమ్మలను వదలరు. ఈ‌హత్య కేసులో దోషులను కఠినంగా శిక్షించాలి. గత జగన్ ప్రభుత్వంలో వేల‌కోట్ల రూపాయల మద్యం కుంభకోణం చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దమ్ముంటే నేను అడిగే వాటికి సమాధానం చెప్పాలి. ప్రజల సొమ్ము దోచుకున్న మీరు‌ ప్రజా నాయకుడిని ఓడిస్తా అంటూ ప్రగల్భాలు పలుకుతారా. వైసీపీ నేతలతో సోషల్ మీడియాలో చంద్రబాబు, లోకేష్‌లపై నీచంగా ట్రోల్ చేయిస్తారా. అవినీతి సొమ్ముతో అడ్డగోలుగా వ్యవహారిస్తే... మీ అందరి సంగతి తేలుస్తాం. అయ్యప్ప సాక్షిగా మద్యం కుంభకోణంలో మా పాత్ర లేదని చెప్పే ధైర్యం ఉందా. ప్రతి సంవత్సరం మాల వేయడం‌ కాదు...అవినీతి చేయకుండా .. నిజాయితీగా బతకాలి. ఈ మద్యం కుంభకోణం గురించి ప్రజలకు కూడా వాస్తవాలు తెలియాలి. రేపు తండ్రీ, కొడుకులు అరెస్టు అయితే కూటమి ప్రభుత్వంపై గగ్గోలు పెడతారు. తప్పు చేసిన ఎవరైనా జైలుకు వెళ్లక తప్పదు. మేము తప్పు చేయకపోయినా మా వాళ్లను అక్రమంగా అరెస్టు చేశారు. నా ఛాలెంజ్‌కు పెద్దిరెడ్డి కుటుంబం స్పందించాలి. మద్యం అవినీతి సొమ్ముతో మాకు సంబంధం లేదని ప్రమాణం చేయాలి. ప్రమాణం చేయకుండా చంద్రబాబు, కూటమి ప్రభుత్వంపై నిందలు వేస్తే చూస్తూ ఊరుకోం. ప్రజలు కూడా వారి అవినీతి గురించి తెలుసుకుని, వారు చేసే తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టండి’ అని బుద్దా వెంకన్న కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి...

CM Chandrababu: వ్యోమగాములపై సీఎం చంద్రబాబు ఆసక్తికర ట్వీట్..

Big Shock To YSRCP: వైసీపీకి బిగ్‌ షాక్.. మరో నేత జంప్

Bayyavaram Incident: బయ్యవరం ఘటనపై చంద్రబాబు సీరియస్.. అలా చేయమంటూ ఎస్పీకి ఆదేశం..

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 19 , 2025 | 11:28 AM