Share News

AP New Bar Policy: గుడ్ న్యూస్.. మందుబాబుల కోసం నూతన పాలసీ..!

ABN , Publish Date - Aug 01 , 2025 | 09:27 PM

ఆంధ్రప్రదేశ్ నూతన బార్ పాలసీపై ఏపీ మంత్రుల బృందం కీలక సమావేశం నిర్వహించింది. ఈ నెల 31వ తేదీతో ముగియనుంది ప్రస్తుత పాలసీ గడువు. మంగళగిరి ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం నుంచి హైబ్రిడ్ మోడ్‌లో ఈ సమావేశం జరిగింది. రాబోయే కొత్త బార్ పాలసీ రూపకల్పనపై సమగ్ర చర్చ చేశారు.

AP New Bar Policy: గుడ్ న్యూస్.. మందుబాబుల కోసం నూతన పాలసీ..!
AP GOVT on New Bar Policy

అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన బార్ పాలసీపై (New Bar Policy) ఏపీ మంత్రుల బృందం (AP Ministers) ఇవాళ(శుక్రవారం) కీలక సమావేశం నిర్వహించారు. ఈనెల (ఆగస్టు) 31వ తేదీతో ముగియనుంది ప్రస్తుత బార్ పాలసీ గడువు. మంగళగిరి ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం నుంచి హైబ్రిడ్ మోడ్‌లో ఈ సమావేశం జరిగింది. రాబోయే కొత్త బార్ పాలసీ రూపకల్పనపై సమగ్ర చర్చ చేశారు. ఈ సమావేశానికి ఎక్సైజ్, మైన్స్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఇంధన శాఖ మంత్రి గొట్టి‌పాటి రవికుమార్ ప్రత్యక్షంగా హాజరయ్యారు. ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, సెర్ప్, ఎన్ఆర్ఐ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య, విద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వర్చువల్‌గా ఈ సమావేశానికి హాజరయ్యారు.


ప్రస్తుత పాలసీలో ఏపీలో 840 స్టాండ్‌లోన్ బార్లు, 50 స్టార్ హోటల్స్, మైక్రోబ్రూరీస్ లాంటి సంస్థలకు లైసెన్సులు మంజూరు అయ్యాయని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. అలాగే 44 బార్ లైసెన్సులు గడువు ముగిసిన తర్వాత రెన్యువల్ కాకపోవడంపైనా చర్చించారు. ఇరుగు, పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కేరళల బార్ విధానాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఏపీ వైన్స్ డీలర్లు, స్టార్ హోటళ్ల అసోసియేషన్‌లు, హోటల్ యజమానుల సమాఖ్యల నుంచి వచ్చిన వినతులను మంత్రుల దృష్టికి ఎక్సైజ్ అధికారులు తీసుకువచ్చారు.


గతంలో పాటించిన బార్ లైసెన్సింగ్ విధానాలు, వాటి ప్రభావం, కొత్త విధానాల్లో ఆర్థిక ప్రయోజనాలు ఎలా ఉండబోతున్నాయనే విషయంపైనా చర్చ సాగింది. టూరిజం శాఖతో సమన్వయం కల్పించి, పర్యాటక అభివృద్ధికి అనుకూలంగా పాలసీ రూపొందించాలని మంత్రులు ఆదేశించారు. కొత్త పారిశ్రామిక కారిడార్లలో బార్లకు చేయాల్సిన మార్పులపైనా మాట్లాడారు. ఈ సూచనల ఆధారంగా బార్ పాలసీకి తుది రూపం ఇవ్వాలని మంత్రులు నిర్ణయం తీసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ లిక్కర్ స్కామ్‌ నిందితులకు రిమాండ్ పొడిగింపు

చేనేతలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్

For More AP News and Telugu News

Updated Date - Aug 01 , 2025 | 09:53 PM