Share News

SIT Raids: ఏపీ మద్యం కుంభకోణం.. రాజ్ కసిరెడ్డి సంస్థల్లో సిట్ సోదాలు

ABN , Publish Date - Jul 26 , 2025 | 05:39 PM

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. హైదరాబాద్‌లో శనివారం పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. జగన్‌కు చెందిన భారతీ సిమెంట్స్‌లో సిట్ అధికారులు సోదాలు చేశారు.

SIT Raids: ఏపీ మద్యం కుంభకోణం.. రాజ్ కసిరెడ్డి సంస్థల్లో సిట్ సోదాలు
SIT Raids

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో (Andhra Pradesh Liquor Scam) దూకుడు పెంచారు సిట్ అధికారులు. హైదరాబాద్‌లో ఇవాళ(శనివారం జులై 24) పలు ప్రాంతాల్లో కీలక సోదాలు నిర్వహించారు. జగన్‌కు చెందిన భారతీ సిమెంట్స్‌లో సోదాలు ప్రారంభించారు సిట్ అధికారులు. సిట్ ఇప్పటికే అరెస్టు చేసిన బాలాజీ గోవిందప్ప భారతీ సిమెంట్స్‌లో డైరెక్టర్‌గా ఉండటంతో ఆ కంపెనీలో సోదాలు చేపట్టారు. రాజ్ కసిరెడ్డికి చెందిన రీసోర్స్ వన్ కంపెనీలో కూడా సిట్ సోదాలు చేశారు. ఇప్పటికే అరెస్టు అయిన చాణక్యకు చెందిన టీ గ్రిల్ రెస్టా రెంట్‌లో కూడా సోదాలు ప్రారంభించారు సిట్ అధికారులు. కార్యాలయాల్లో సోదాలతో పాటు ఎవరెవరూ ఎక్కడెక్కడ సమావేశం అయ్యారు, ఎన్నిసార్లు భేటీ అయ్యారనే అంశాలపై సాంకేతిక ఆధారాలతో సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు.


బంజారాహిల్స్ భారతి సిమెంట్ కార్యాలయంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. భారతి సిమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులో డాక్యుమెంట్లని సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు. ఆరుమందితో కూడిన సిట్ బృందం సోదాలు నిర్వహిస్తున్నారు. ఏపీ లిక్కర్ స్కాం భారతి సిమెంట్ కేంద్రంగా నడిచిందని అనుమానాలు రావడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. రూ.3500 కోట్ల స్కామ్ వ్యవహారంలో విచారణ కొనసాగుతోంది. హైదరాబాద్‌లో ఆరు డెన్లకు భారతి సిమెంట్ నుంచే ముడుపులు తరలించినట్లు గుర్తించారు. భారతీ సిమెంట్‌లో మద్యం సరఫరా కంపెనీలు, డిస్టలరీల యజమానులతో సమావేశాలు నిర్వహించినట్లు అధికారుల విచారణలో తేలింది. ఈ సమావేశాల అనంతరం ముడుపులను భారతీ సిమెంట్ కంపెనీలో అందజేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన షెడ్యూల్ ఖరారు

లొంగిపోయిన అగ్ర మావోయిస్టులు.. డీజీపీ ఏమన్నారంటే..

Read latest AP News And Telugu News

Updated Date - Jul 26 , 2025 | 06:24 PM