Share News

Ambati Rambabu Misbehaviour: రెచ్చిపోయిన అంబటి సోదరులు

ABN , Publish Date - Jun 18 , 2025 | 03:03 PM

Ambati Rambabu Misbehaviour: మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి రెచ్చిపోయారు. మాజీ సీఎం పర్యటనలో ఏకంగా పోలీసులకే వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి.

Ambati Rambabu Misbehaviour: రెచ్చిపోయిన అంబటి  సోదరులు
Ambati Rambabu Misbehaviour

పల్నాడు, జూన్ 18: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Former CM YS Jaganmohan Reddy) పర్యటనలో మాజీ మంత్రి అంబటి రాంబాబు (Former Minister Ambati Rambabu) రెచ్చిపోయారు. మాజీ మంత్రి, అతని సోదరుడు మురళి కలిసి రోడ్డుపై అడ్డంగా పెట్టి ఉన్న బారికేడ్‌లు విసిరిపడేశారు. వీరిని అడ్డుకోబోయిన పోలీసులపై అంబటి రాంబాబు దౌర్జన్యంగా ప్రవర్తించారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అంతేకాకుండా ఏకంగా పోలీసులకే అంబటి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఆపై అంబటి సోదరులు బారికేడ్‌లు తొలగించి వైసీపీ కార్యకర్తలను ముందుకు పంపించారు.


కాగా.. జగన్ రెడ్డి పల్నాడు పర్యటన మొత్తం అరాచకాలు, దౌర్జన్యాలతో ముందుకు సాగుతోంది. సత్తెన్నపల్లి పట్నంలో ఓ సీఐపై వైసీపీ మూకలు దౌర్జన్యం చేసి అతడిని నెట్టివేయగా.. మరోవైపు ఆర్టీసీ బస్సుపై జెండా కర్రలతో దాడి చేశారు. పల్నాడు, గుంటూరు జిల్లా సరిహద్దులో పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్ల వద్ద మాజీ మంత్రి హల్‌చల్ చేశారు. బారికేడ్లను తోసివేసి.. ఆంక్షలు విధించిన పోలీసులపై దౌర్జన్యం చేస్తూ వైసీపీ కేడర్‌ను సత్తెనపల్లి వైపు వెళ్లేలా వీరంగం సృష్టించారు. నిబంధనలకు విరుద్ధంగా అంబటి భారీ ర్యాలీగా రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన అంబటి.. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను రోడ్డుపై నుంచి తోసిపడేశారు.


జగన్ పల్నాడులోకి ప్రవేశించాక.. ఆయనతో పాటు వచ్చిన కార్యకర్తలు, కేడర్ వాహనాలను పల్నాడు వద్ద బార్డర్‌లో బారికేడ్లు పెట్టి నిలిపివేశారు. అదే రోడ్డులో వస్తున్న అంబటి రాంబాబు, అతని సోదరుడు అంబటి మురళి.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వారిద్దరినీ పంపిస్తామని పోలీసులు చెప్పినప్పటికీ బారికేడ్లను స్థానిక నేతలతో కలిసి సోదరులు ఇద్దరు బారికేడ్లను లాగిపడేస్తూ పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. నర్సరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావుకు పోలీసుల అంతు తేలుస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం వైసీపీ చేపట్టిన వెన్నుపోటు దినోత్సవంలో కూడా పట్టాభిపురం సీఐపై కూడా అంబటి రాంబాబు ఇదే విధంగా దురుసుగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. పోలీసుల పట్ల అంబటి రాంబాబు ప్రవర్తిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


ఇవి కూడా చదవండి

లిక్కర్ స్కామ్‌లో చెవిరెడ్డికి మరో షాక్

నెలరోజుల తర్వాత విశాఖలో సన్నీ భయ్యా ప్రత్యక్షం

ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 18 , 2025 | 03:37 PM