AP NEWS: లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్
ABN , Publish Date - Apr 26 , 2025 | 02:37 PM
Sajjala Sridhar Reddy: మద్యం కుంభకోణంలో మరో కీలక వ్యక్తి సజ్జల శ్రీధర్ రెడ్డిని శుక్రవారం సిట్ అధికారులు అ రెస్ట్ చేశారు. ఇవాళ ఏసీబీ కోర్టులో హాజరుపరచగా సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్ విధించింది.

విజయవాడ: మద్యం కుంభకోణంలో ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డికి వచ్చే నెల ఆరో తేదీ వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఇవాళ(శనివారం) ఉదయం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు ముగిసిన అనంతరం శ్రీధర్ రెడ్డిని ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు హాజరుపరిచారు. ఈ కేసుపై ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది. విచారణలు ముగిసిన అనంతరం శ్రీధర్ రెడ్డికి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది.
కాగా.. వైసీపీ ప్రభుత్వంలో మద్యం కుంభకోణం వెలుగు చూసింది. ఈ స్కాంపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా విచారణ చేపట్టింది. ఈ కేసు విషయంలో సిట్ అధికారులు వేగంగా దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటికే ఇదే కేసులో రాజ్ కసిరెడ్డిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ స్కాంలో ఎవరున్నా విడిచి పెట్టవద్దని ఏపీ ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది. దీంతో సిట్ అధికారులు ఈ కేసు విషయంలో దూకుడు పెంచారు. ఈ క్రమంలోనే మద్యం కుంభకోణంలో మరో కీలక వ్యక్తి సజ్జల శ్రీధర్ రెడ్డిని నిన్న(శుక్రవారం) సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సిట్ అధికారులకు వచ్చిన సమాచారం మేరకు శ్రీధర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు(శనివారం) తెల్లవారుజామున విజయవాడకు అధికారులు తరలించారు. మద్యం కుంభకోణంలో కమీషన్ల వ్యవహారంలో సజ్జల శ్రీధర్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు సిట్ అధికారులు గుర్తించారు.
2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం విధానం మార్పు, కమిషన్లు, లోకల్ బ్రాండ్లపై జరిగిన సమావేశాల్లో సజ్జల శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. ఇదే విషయాన్ని మీడియాకు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా చెప్పారు. కర్నూలులో స్పై డిస్టలరీను స్వాధీనం చేసుకుని మద్యం తయారీ చేయించారనే ఆరోపణలు సజ్జల శ్రీధర్ రెడ్డిపై ఉన్నాయి. సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్ట్‌తో వైసీపీలోని కొంతమంది నేతల్లో ఆందోళన నెలకొంది. సిట్ కార్యాలయంలో శ్రీధర్ రెడ్టిని సిట్ అధికారులు విచారించారు. మద్యం లావాదేవీలు, కమీషన్ల వ్యవహారాలపై అధికారులు పలు ప్రశ్నలు అడిగారు. ఈ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచి సమగ్ర విచారణ జరుపుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Veerayya Chowdary: మూడు మాఫియాల పగ
YS Sharmila: బీజేపీ విధానాలతోనే దేశంలో ఉగ్రవాదం
Heatwave: ఎండ తీవ్రత.. వడగాడ్పులతో ఉక్కిరిబిక్కిరి
Read Latest AP News And Telugu News